7ఏకగ్రీవం..!


Thu,January 10, 2019 02:03 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో తొలి విడతలో జరుగుతున్న నామినేషన్ల పర్వం బుధవారం ముగిసింది. ఈ నెల 7 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా నామినేషన్ల చివరి రోజైన బుధవారం నాటికి కొన్ని పంచాయతీల్లో సర్పం చ్, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలు చేశారు. అయా స్థానాలు ఏకగ్రీవాలు కాగా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ స్వగ్రామం దేవరకొండ మండలం రత్యతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా ఆ స్థానానికి ఎమ్మెల్యే తండ్రి రమావత్ కన్నీలాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఇక ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈ పంచాయతీ పరిధిలోని 1, 2, 4 వార్డు స్థానాకలు కూడా ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయా వార్డులు ఏకగ్రీవమైనట్లే. ఇదే బాటలో డివిజన్ పరిధిలోని పలు తండాలు, పల్లెలు ఏకగ్రీవ బాట పట్టాయి. చందంపేట మండలం కోరుట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ రిజర్వ్ ఆ స్థానానికి ఒకే నామినేషన్ దాఖలు చేసిన దొండేటి మల్లారెడ్డి ఏకగ్రీవ సర్పంచ్ కానున్నారు.

ఈ పంచాయతీలోని 8 వార్డులకు సైతం ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. ఎస్టీ జనరల్ రిజర్వ్ అయిన ఇదే మండలం అచ్చంపేట పట్టి సర్పంచ్ స్థానానికి జర్పుల లోక్యానాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 8 వార్డులకు కూడా ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. చందంపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ యాపలపాయి తండ గ్రామ పంచాయతీలో 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. వార్డులన్నీ ఏకగ్రీవం కాగా సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలైనప్పటికీ ఇక్కడ కూడా ఏకగ్రీవం దిశగా చర్చలు జరుగుతున్నాయి. డిండి మండలం లోని కాల్య తండ ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా రమావత్ జుక్క ఒకే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీని పరిధిలోని 8 వార్డులకు కూడా ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. పీఏపల్లి మండలంలోని ఘనిపెల్లి గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ కాగా ఒకే నామినేషన్ వేసిన మునగాల అంజిరెడ్డి సర్పంచ్ ఏకగ్రీవం కానున్నారు. అలాగే ఒక్కొక్క నామినేషనే దాఖలైన 8 వార్డులు కూడా ఏకగ్రీవం కానున్నాయి.

320
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...