రెండోరోజూ అదేజోరు


Wed,January 9, 2019 02:47 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ దేవరకొండ రెవెన్యూ డివిజన్ 304 గ్రామాల్లో కొనసాగుతోంది. మంగళవారం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 259 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వార్డులకు 743 నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండో నామినేషన్ల తీరు ఇలా
దేవరకొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 38 నామినేషన్లు, వార్డు స్థానాలకు 81 నామినేషన్లు, కొండమల్లేపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 42 నామినేషన్లు, వార్డు స్థానాలకు 77 నామినేషన్లు, డిండి మండలంలో సర్పంచ్ స్థానాలకు 15 నామినేషన్లు, వార్డు స్థానాలకు 34 నామినేషన్లు, చందంపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 17, వార్డు స్థానాలకు 40 నామినేషన్లు, నేరడుగొమ్ము మండలంలో సర్పంచ్ 23, వార్డు స్థానాలకు 58, చింతపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 25, వార్డు స్థానాలకు 91 నామినేషన్లు, పీఏపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 33, వార్డు స్థానాలకు 103 నామినేషన్లు, మర్రిగూడ మండలంలో సర్పంచ్ స్థానాలకు 11, వార్డు స్థానాలకు 47 నామినేషన్లు, నాంపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 20 నామినేషన్లు, వార్డు స్థానాలకు 115 నామినేషన్లు, గుర్రంపోడు మండలంలో సర్పంచ్ స్థానానికి 35 నామినేషన్లు, వార్డు స్థానాలకు 97 నామినేషన్లు దాఖలయ్యాయి.
కన్నీలాల్ నామినేషన్ దాఖలు
మండలంలోని రత్యతండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి రమావత్ కన్నీలాల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రత్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో దుబ్బతండా ఉండగా 6 వార్డుల పరిధిలో 352 ఓట్లు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే తండావాసులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో సమావేశమై కన్నీలాల్ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈక్రమంలోనే మంగళవారం ఆయన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా తండావాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఆయనను సర్పంచ్ అధికారులు ప్రకటించడం లాంఛనం కానుంది.

268
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...