ఎన్నికల వ్యయాన్ని పక్కాగా నమోదు చేయాలి


Wed,January 9, 2019 02:47 AM

నీలగిరి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి మండలంలో ఎన్నికల వ్యయ నియంత్రణకు నియమించిన ప్రత్యేకాధికారితో పాటు వ్యయ నమోదుదారులు కీలక పాత్ర పోషించాలని గ్రామపంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సహాయ వ్యయ నియంత్రణ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల వ్యయ నియంత్రణకు సంబంధించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్ నమోదు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార వ్యయానికి సంబంధించి నిర్ణయించిన రేట్లను జిల్లా ఎన్నికల వ్యయ నియంత్రణ విభాగం నుంచి పంపించనున్నట్లు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల వ్యయంలో భాగంగా ప్రతి రోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ప్రకటలనలను నమోదు చేసి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ నోడల్ అధికారికి పంపాలని సూచించారు. ఎన్నికల వ్యయ నియంత్రణకు సంబంధించి సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.
బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
ఎంజీయూనివర్సిటీ: మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల బీఈడీ కళాశాలల్లో 2017-19 బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులకు మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 31లోగా ఫీజులు చెల్లించాలని, రూ. 200 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 2లోగా చెల్లించాలన్నారు. పరీక్ష పీజు రూ. 900, మార్క్స్ రూ. 60 కలుపుకుని మొత్తం 960 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఫిజికల్ హ్యాండిక్రాప్టు వారికి ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. కళాశాలల వారు ఈఏఎఫ్, ఎన్ ఫీ అబ్ పత్రాలను ఫిబ్రవరి 5లోగా ఎంజీయూ పరీక్షల విభాగంలో అందజేయాలని ఆతర్వాత వచ్చిన వాటిని అంగీకరించరని పేర్కొన్నారు.

వరద కాల్వకు నీటి విడుదల
పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి సౌక ర్యం కోసం ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్(వరదకాల్వ) నుంచి నీటిని మంగళవారం సాయంత్రం ఈఈ శ్రీనివాస్ స్వీచ్ ఆన్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం తాగునీటి చెరువులను నింపడంతోపాటు సమీప గ్రామాల్లో భగర్భ జలాలు పెరగడానికి దోహదం చేస్తాయన్నారు.కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులతోపాటు టీఆర్ ప్రతినిధులు, డీఈ రమేష్, ఏఈ ఖదీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

343
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...