పల్లెపోరులో నామినేషన్ల జోరు


Tue,January 8, 2019 02:36 AM

-తొలివిడుతగా 304 గ్రామాల్లో ఎన్నికలు
-సర్పంచ్‌కు 213, వార్డులకు 216 నామినేషన్లు దాఖలు
-నాంపల్లి మండలంలో అత్యధికం, కొండమల్లేపల్లిలో అత్యల్పం
దేవరకొండ, నమస్తేతెలంగాణ : మొదటి విడుత పల్లెపోరులో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. దేవరకొండ డివిజన్‌లోని 304 గ్రామపంచాయతీలకు ఈ నెల 21న జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. సర్పంచ్ స్థానాలకు 213, వార్డు స్థానాలకు 216 నామినేషన్లు దాఖలయ్యాయి. నాంపల్లి మండలంలో అత్యధికంగా, కొండమల్లేపల్లి మండలంలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
దేవరకొండ, నమస్తేతెలంగాణ: దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చం దంపేట, నేరడుగొమ్ము, చింతపల్లి, పిఏపల్లి, గుర్రంపో డు, మర్రిగూడ, నాంపల్లి మండలాల పరిధిలో ఉన్న 304 సర్పంచ్ స్థానాలకు, 2572 వార్డు స్థానాలకు మొదటిరోజు సోమవారం నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం డివిజన్ వ్యాప్తంగా 84 క్లస్టర్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. సర్పంచ్ స్థానాలకు 213 నామినేషన్లు, వార్డు స్థానాలకు 216 నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలిరోజు నామినేషన్ల తీరు
దేవరకొండ మండలంలో సర్పంచ్ స్థానాలకు 22 నామినేషన్లు, వార్డు స్థానాలకు 10 నామినేషన్లు, కొం డమల్లేపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 8 నామినేషన్లు, వార్డు స్థానాలకు 13 నామినేషన్లు, డిండి మం డలంలో సర్పంచ్ స్థానాలకు 14 నామినేషన్లు, వార్డు స్థానాలకు 4 నామినేషన్లు, చందంపేట మండలంలో సర్పంచ్ స్థానాలకు 14, వార్డు స్థానాలకు 14 నామినేషన్లు, నేరడుగొమ్ము మండలంలో సర్పంచ్ స్థానాలకు 17 నామినేషన్లు, వార్డు స్థానాలకు 16 నామినేషన్లు, చింతపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు, వార్డు స్థానాలకు 40 నామినేషన్లు, పిఏపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు, వార్డు స్థానాలకు 17 నామినేషన్లు, మర్రిగూడ మండలంలో సర్పంచ్ స్థానాలకు 21 నామినేషన్లు, వార్డు స్థానాలకు 36 నామినేషన్లు, నాంపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 38 నామినేషన్లు, వార్డు స్థానాలకు 52 నామినేషన్లు, గుర్రంపోడు మండలంలో సర్పంచ్ స్థానానికి 31 నామినేష న్లు, వార్డు స్థానాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...