కంటికి వెలుగు...


Tue,January 8, 2019 02:36 AM

-ఇప్పటివరకు 5,60,822 మందికి పరీక్షలు
-415మందికి కళ్లద్దాలు, 350 మందికి ఆపరేషన్‌కు రెఫర్
నీలగిరి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో 87 వ రోజు కొనసాగుతోంది. కంటి పరీక్షల్లో పాల్గొన్న ప్రజలు నేత్రానందం పొందారు. జిల్లాలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 37 వైద్య బృందాలు సోమవారం 5,268 మం దికి పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటివరకు 5,60,822 మందికి రోగులకు వైద్య బృందం సభ్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పలువురికి కళ్లద్దాలను అందజేశారు.స్థ్ధానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వైద్యపరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి ఆద్దాలను, మందులను ఉచితం గా పం పిణీ చేశారు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 32 చోట్ల్ల, పట్టణ ప్రాంతాల్లో 5 చోట్లవైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5,60,822 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 2547(ఇప్పటివరకు 2,61,958 ) మంది పురుషు లు, 2721 (ఇప్పటివరకు 2,98,829 ) మంది స్త్రీలు, 35మంది ఇతరులు పాల్గొనగా 415(ఇప్పటివరకు 99,125) మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కంటిఅద్దాలు అందజేశారు. మరో 318 (ఇప్పటి వరకు74,480) మందికి రెండు కండ్లల్లో రెండు రకాల చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూడు వారాల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర దవా ఖానకి 350 (ఇప్పటివరకు 37,670)మందికి శస్త్రచికిత్సల కోసం రెఫర్ చేశారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, అఫ్తాలిస్టులు ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...