పంచాయతీ ఎన్నికల నిర్వహణకు


Tue,January 8, 2019 02:36 AM

-జిల్లా నోడల్ అధికారుల నియామకం : కలెక్టర్
నీలగిరి : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివిధ పనుల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నోడల్ అధికారులు, మండల పర్యవేక్షక అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బందితో పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూస్‌పవర్, ట్రైనింగ్, బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపర్, శాంతిభద్రతలు, ఎంసీసీ జోనల్ అధికారులు, ఉద్యోగుల సంక్షేమం, ఎన్నికల వ్యయ నియంత్రణ, నామినేషన్, రవాణా పనులకు జిల్లాస్థాయి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, సీఈఓ, కలెక్టరేట్ సిబ్బందితో కలెక్టర్ కార్యాలయం నుంచి నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల మార్గదర్శకాలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. వివిధ కమిటీలకు సంబంధించి డివిజన్, మండల స్థాయి నోడల్ అధికారులను నియమించి ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ లొకేషన్, పేరు మార్పులు ఉంటే పంపాలని, క్రిటికల్, సాధారణ పోలింగ్ స్టేషన్లు గుర్తించి ఆయా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీసులు, ఎన్నికల విభాగ డీటీని ఆదేశించారు. జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, అప్‌లోడింగ్, ప్రీ స్క్రూట్నీకి తగు ఏర్పాట్లు చేయాలని, ఆర్‌ఓ దగ్గర రెండు హెల్పు డెస్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీపీఓ శ్రీకాంత్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం కోటేశ్వర్‌రావు, ట్రెయినీ కలెక్టర్ రోహిత్ పాల్గొన్నారు.

అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి : జేసీ
నాంపల్లి : నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 9 నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం జేసీ నారాయణరెడ్డి నాంపల్లి మండల కేంద్రం, పస్నూర్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయాన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద గ్రామాలకు సంబంధించిన ఓటరు లిస్టులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎన్నికల మండల సూపర్‌వైజింగ్ అధికారి సంగీతలక్ష్మి, తహసీల్దార్ నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, డిప్యూటీ తహసీల్దార్ ఎండీ.ముక్తర్, ఆర్‌ఐ నర్సింహ తదితరులున్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...