నేటి నుంచి నామినేషన్లు


Mon,January 7, 2019 02:11 AM

- తొలి విడుత
పంచాయతీ పోరుకు సన్నద్ధం
- దేవరకొండ డివిజన్
10 మండలాల్లో మొదటి విడుత ఎన్నికలు
- నామినేషన్ల స్వీకరణకు 84 క్లస్టర్ కేంద్రాలు
- 11 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణ
- ఏకగ్రీవం దిశగా అడుగులేస్తున్న తండాలు
స్టేజ్-1 అధికారులు
రిటర్నింగ్ అధికారులు : 93
సహాయక రిటర్నింగ్ అధికారులు : 93
స్టేజ్-2 అధికారులు : 304
పీఓలు : 2,572
ఓపీఓలు : 2,572
బ్యాలెట్ బాక్స్ 3వేలు (సుమారు)

దేవరకొండ, నమస్తేతెలంగాణ: దేవరకొండ డివిజన్ పరిధిలో దేవరకొండ, డిండి, చందంపేట, నేరెడుగొ మ్ము, చింతపల్లి, కొండమల్లేపల్లి, పీఏపల్లి, నాంపల్లి, మర్రిగూడ, గుర్రంపోడు మండలాల పరిధిలోని 304 సర్పంచ్, 2,572 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను స్టేజ్-1, స్టేజ్-2 అధికారుల ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. స్టేజ్-1 లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉండగా.. వీరు నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, అభ్యర్థుల గుర్తుల కేటాయింపు వంటి బాధ్యతలు చూస్తారు. స్టేజ్-2లో పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితోపాటు, ఉప సర్పంచి ఎన్నికలను సైతం స్టేజ్-2 అధికారులు పూర్తి చేస్తారు.
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ డివిజన్ పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి ఎన్నికల ప్రక్రి య ప్రారంభమవుతోంది. నామినేషన్ల స్వీకరణకు సం బంధించి డివిజన్ వ్యాప్తంగా 84 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేవరకొండ మండలంలో 13, చం దంపేట మండలంలో 6, నేరెడుగొమ్ము మండలంలో 4, కొండమల్లేపల్లి మండలంలో 9, డిండి మండలం లో 10, చింతపల్లి మండలంలో 9, పీఏపల్లి మండలం లో 10, నాంపల్లి మండలంలో 9, గుర్రంపోడు మండలంలో 9, మర్రిగూడ మండలంలో 5 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
పారదర్శకంగా పోలింగ్ నిర్వహించడానికి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధ్దమవుతున్నారు. సున్నిత, అతిసున్నిత, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అతి సున్నిత, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణతోపాటు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

11 మంది నోడల్ అధికారులు
సీనియర్, వివిధ విభాగాలకు చెందిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను నోడల్ అధికారులను మండలానికి ఒకరు చొప్పున పది మందిని నియమించారు. ఎన్నికల సామగ్రి తరలింపు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు రాకపోకలు సాగించడానికి వాహనాల ఏర్పాటుతోపాటు డివిజన్, మండల, గ్రామస్థాయి నుంచి అధికారులను సమన్వయం చేసుకుంటూ నోడల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి అమలుతోపాటు, అభ్యర్థుల వ్యయ పరిశీలన సైతం నోడల్ అధికారులు చేస్తారు. పంచాయతీ నియమావళి(ఎంసీసీ- మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను అమ లుచేయడానికి మండలస్థాయిలో తహసీల్దార్లు, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఉండగా.. డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిగా దేవరకొండ మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ వ్యవహరించనున్నారు.

వివిధ మండలాలకు నియమించిన నోడల్ అధికారుల వివరాలిలా ఉన్నాయి. దేవరకొండ మండలానికి రాజ్ కుమార్(హౌసింగ్ పిడి), డిండి మండలానికి సాయిరాం(స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్), చందంపేట మండలానికి ఉమాపతి(ఎస్సెల్బీసీ ఈఈ), నేరెడుగొమ్ము మండలానికి భద్రునాయక్(ఇరిగేషన్ ఈఈ), కొండమల్లేపల్లి మండలానికి శేఖర్ పిడి), చింతపల్లి మండలానికి లక్ష్మణ్(డిండి లిఫ్ట్ ఈఈ), పీఏపల్లి మం డలానికి విజయేందర్ రెడ్డి(దేవరకొండ ఏడిఏ), గుర్రంపోడు మండలానికి రెడ్కో(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), నాంపల్లి మండలానికి సైదా లక్ష్మి(జిల్లా హార్టికల్చర్ అధికారి), మర్రిగూడ మండలానికి సుదర్శన్ రెడ్డి(డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్)నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.

మండలస్థాయిలో నిఘా బృందాలు
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో వ్యయ పరిశీలక, సర్వైలైన్స్, స్టాటిస్టిక్స్, వీడియో చిత్రీకరణ బృం దం, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నా రు. ఒక్కో బృందంలో నలుగురు అధికారులను నియమిస్తారు. ఎన్నికల నియమావళి అమలు, పర్యవేక్షణను ఈ బృందాలు చూసుకుంటాయి. డివిజన్ పరిధిలోని పంచాయతీ కారోబార్లు, కార్యదర్శులు సైతం ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అవుతారు.

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల బాధ్యతలను విభజించి వివిధ శాఖ ల అధికారులకు అప్పగించాం. ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నేతలు, ఓటర్లు సహకరించాలని కోరుతున్నాం.
- గుగులోతు లింగ్యానాయక్,
ఆర్డీఓ, డివిజనల్ రిటర్నింగ్ ఆఫీసర్

371
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...