నటీఆర్ గ్రామస్వరాజ్యం


Mon,January 7, 2019 02:10 AM

-నూతన పంచాయతీ చట్టంలో సర్పంచ్ విశేష అధికారులు
-ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలి : ఎంపీ బూర
-కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
చండూరు, నమస్తే తెలంగాణ : టీఆర్ ప్రభుత్వంతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ కలిసి స్థానిక రహదారి బంగ్లాలో విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా నూతన పంచాయతీ రాజ్ చట్టం ఏర్పాటు జరిగిందన్నారు. చట్టంలో సర్పంచ్ విశేష అధికారాలు ఇస్తూ గ్రామాభివృద్ధ్దికి బాటలు వేసేలా ఉందన్నారు. హరితహారం, జనన మరణాల ధ్రువీకరణ, పరిసరాల పరిశుభ్రతపై విధించే అవకాశం సర్పంచ్ ఇచ్చినట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ బలపరిచిన అభ్యర్థ్దులను గెలిపించి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్ర తీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ మాట్లాడుతూ టీఆర్ కార్యనిర్వాహక కార్యదర్శి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, అందరూ సమిష్టిగా పని చేయాలన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ జెండా ఎగురవేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కార్నటి విద్యాసాగర్, మునగాల నారాయణరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం వెంకట్ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బొమ్మరబోయిన వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు కోడి వెంకన్న, ఎంపీటీసీలు తిరందాసు అనిత ఆంజనేయలు, గుండమల్ల వెంకటేశం, మాజీ సర్పంచ్ నల్లగంటి మల్లేశం, దామెర యాదయ్య, బొమ్మరబోయిన లక్ష్మయ్య, కళ్లెం సురేందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పందుల భిక్షం, గండూరి స్వాతి జనార్దన్, జూలూరి ఆంజనేయులు, శ్రీనివాస్, కట్ట భిక్షం, తేలుకుం ట్ల జానయ్య, హైమద్, ప్రసాద్, నరేష్, సురేష్, రమేష్, వెంకటేశం, యాదయ్య, శ్రీనులున్నారు.

219
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...