సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి


Mon,January 7, 2019 02:09 AM

-దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న సీఎం కేసీఆర్
-విలేకరుల సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్
-కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే భాస్కర్
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : గ్రామాల అభివృద్ధ్ది కోసం ప్రజలంతా ఐక్యంగా ఉండి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, గుత్తా సుఖేందర్ సూచించారు. ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ విశేష అధికారాలు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలతోపాటు పదవి నుంచి తప్పించే అవకాశముందని వివరించారు. సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వ పోత్సాహకంగా రూ.10లక్షలు అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధు ల నుంచి రూ.10లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయా ల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో ఒకటి మజ్లిస్ మినహా 16స్థానాల్లో టీఆర్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాను న్న ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసేందుకు స్వాగతిస్తున్నామని తెలిపారు. నల్లగొండ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణాలో దివాలా తీసిన కంపెనీలా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దెవా చేశారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండో విడత జరిగే పం చాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏకగ్రీవం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. కష్టపడి పని చేసే వారికి మున్ముందు న్యాయం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్ ధనావత్ చిట్టిబాబు,యడవెల్లి శ్రీనివాస్ మట్టపల్లి సైదులుయాదవ్, ఎన్. యాదగిరిరెడ్డి, ఎన్.కరుణాకర్ మగ్దూంపాష, ఎండీ.ఫహీముద్దీన్, మాజీద్ తదితరులున్నారు.

342
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...