కోరుట్ల గ్రామ పంచాయతీ ఏకగ్రీవం


Mon,January 7, 2019 02:09 AM

చందంపేట: మండలంలో నూతనంగా ఏర్పడిన కోరు ట్ల గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు ప్రభుత్వపరంగా రూ.10 లక్షలు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 లక్షలు నజరానా ప్రకటించడంతో ఏకగ్రీవం వైపు మొగ్గు చూపారు. ఇందుకోసం ఆదివారం గ్రామస్తులు సమావేశమై గ్రామం అభివృద్ధి చెందాలంటే టీఆర్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించారు. గ్రామంలో సూమారు 416 మంది ఓటర్లు ఉం డగా 8 వార్డులు ఉన్నాయి. గ్రామానికి జనరల్ రిజర్వేషన్ కావడంతో గ్రామానికి చెందిన దొండేటీ మల్లారెడ్డిని సర్పంచ్ ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు 8 వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటగా కోరుట్ల గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా చేసుకునేందుకు నిర్ణయిచండంతో దీనిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన గ్రామపంచాయతీలను కూడా ఏకగ్రీవంగా చేసుకునేందుకు గ్రామ సభలు నిర్వహించుకున్నారు. గ్రామస్తులు ఒకే నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవం చేసుకోవడంతో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీఎంపీపీ ముత్యాల సర్వయ్య అభినందించారు. మిగిలిన గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగలంటే ఏకగ్రీవం చేసుకోవాలని సూచించారు.

329
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...