ఉపాధి లో పందిరి సాగు


Mon,January 7, 2019 02:08 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: వలసలను నివారించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహా మీ పథకం కాలానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కూలితోపాటు 34 పథకాలు పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నాయి. అయితే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో కూరగాయలను వేసుకోవాలని సూచిస్తుంది. అం దులో భాగంగానే తోటల నిర్మాణం కోసం సహకారం చేస్త్తూ 20గుంటలు కలిగి ఉంటే గుంటల నుంచి కడీలు ఇవ్వడంతోపాటు పందిరి సైతం పూర్తిస్థాయిలో నిర్మిం చే విధంగా చర్యలు తీసుకుంటుంది.

20 గుంటలు ఉంటే పందిరి...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అర్హులైనటువంటి వ్యక్తులకు 20 గుంటల జాగా ఉంటే పందిరి కూరగాయలను దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన మెటీరియల్ అందించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం చర్యలు తీసుకుంటుం ది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ మార్గాలను సమకూర్చాలనే ఉద్దేశంతో పాటు జీవనోపాదులను మెరుగు పరచాలనే ఆలోచన చేసి శాశ్వత ప్రతిపాదికన ఈ పందిరి కూరగాయల పథకాన్ని ప్రవేశ పెట్టింది. 20 గుంటలు ఉన్నటువంటి రైతులకు 1.16 లక్షలు అందజేసి అన్ని రకాలుగా సౌకర్యా లు మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు పని చేయాల్సి ఉంది.
గ్రామసభలో అర్హుల ఎంపిక...
పందిరి కూరగాయలను సాగుకోసం రైతులు ఉపాధిహా మీ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు గ్రామ సభలో రైతు వారిగా కూరగాయల పందిరి పనులకు సంబంధించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు స్వయంగా ఆసక్తి ఉంటే క్షేత్రస్థాయి సహాయకులను కలిసి దరఖా స్తు చేసుకోవాలి. అయితే అర్హులైనటువంటి వారు జాబ్ పట్టాదార్ పాస్ తప్పనిసరిగా కలి గి ఉండాలి. అంతేగాక కావల్సినటువంటి వారు బ్యాం కు పాస్ జిరాక్స్, ఆధార్ సొంత ధృవీకరణ పత్రం సైతం ఇవ్వాల్సి ఉంది. అయితే అర్హత ఉన్నటువంటి వారికి రూ.1,16,858 ఉపాధి హామీ పథకం ద్వారా రానుంది.

రైతు వాటాగా 10శాతం...
గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకమే అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీసుకుని ముందస్తుగా నడుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర నిధులు సైతం ఈ పథకంలో ఖర్చవుతున్నాయి. అయితే పందిరి కూరగాయలు సంబంధించి 1.16 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికి 10శాతం రైతు వాటాగా నిర్ణయించారు. అందులో మెటీరియల్ ఖర్చుతోపాటు కూలీల ఖర్చు సైతం జతకూడింది. జాబ్ కలిగి ఉండటంతో కుటుంబ సభ్యులకు కూలీ మొత్తాన్ని ఇవ్వనుండగా మెటీరియల్ సొమ్మును సంబంధిత వ్యక్తులకు అందజేయనున్నారు.
దరఖాస్తు చేసుకుంటే అందజేస్తాం
ఉపాధిహామీ పథకంలో పందిరి కూరగాయలకు సం బంధించి అర్హులై ఆసక్తి కలిగినటువంటి రైతులు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ఈ పథకానికి సంబంధించి రూ.1.16 లక్షలు ప్రభుత్వం ప్రతి అర ఎకరానికి కేటాయించింది. ప్రభుత్వ అధికార యం త్రాంగమే పూర్తిస్థాయిలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చింది. మెటీరియల్ పాటు ఇందులో కూలీల ఖర్చు కూడా ఉంటుంది.
- శేఖర్ డీఆర్

257
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...