స్వయం పాలనలో సాగు సంబురం


Sun,January 6, 2019 02:13 AM

- సాగర్ ఆయకట్టులో రెండు పంటలకు నీటి విడుదల
- 2013-14సీజన్‌లో 4.19లక్షల ఎకరాలు సాగు
- ఈ వానాకాలంలోనే 3.61లక్షల ఎకరాల్లో సేద్యం
- యాసంగిలోనూ మూడు లక్షల ఎకరాలకు పైనే..
- తెలంగాణ ప్రభుత్వ కృషితో పెరిగిన సాగు విస్తీర్ణం
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: సీమాంధ్రుల పాలలో అడుగడుగునా కృష్ణా జలాలు దోపిడీకి గురయ్యాయి. కృష్ణా జలాలను అక్రమంగా ఆం ధ్రాకు తరలించి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టిన్రు. ఓ కారు నీరు అంది.. ఓ కారు అందక రైతులు అరిగోస పడ్డారు. ఎడమకాల్వ ఆయకట్టు రైతాంగం ఓ కారు పంట పండి ఓ కారు పం ట పండక, పంటలు వేసినా నీరు చివరి భూములకు అందక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ అధినేత సు ధీర్ఘ పోరాటాల ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆంధ్రా నీటి దోపిడీని అడ్డుకున్నారు. ఈ ఐదేళ్లలో నాలుగు సార్లు ఒక్క కారు పంటకు సాగునీరు అందించి ఎడమకాల్వ రైతులకు చేయూత ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టడంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సాగర్ డ్యాంలో తక్కువ నీరు ఉన్నప్పటికీ నీటి పొదుపును పాటిస్తూ ఎడమకాల్వకు యాసంగి పంటలకు సాగునీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు యాసంగి నీటి విడుదల షెడ్యూలు విడుదల చేసి నీరు విడుదల చేశారు.

2013-14 లో రెండు పంటలకు..
2013-14లో ఆనాటి ప్రభుత్వం వానాకాలం, యాసంగి పంటలకు సాగునీటి విడుదల చేసింది. కానీ కాల్వల ఆధునీకరణ చేపట్టక పోవ డం వలన వానాకాలం, యాసంగి పంటలకు నీరు అందించినా వానాకాలంలో 30.12 టీఎంసీలు నీరు విడుదల చేయగా, 21,5782 ఎకరాలకు నీరు అందింది. యాసంగి 23.89 టీఎంసీల నీరు విడుదల చేయగా 20,3912 ఎకరాలకు సాగు నీరు అందింది. మొదటి జోన్ పరిధిలో రెండు పంటలకు కేవలం 4లక్షల 19వేల694 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది. కాగా వానాకాలం, యాసంగి సరిగ్గా నీరు అందక సుమారు 3లక్షలకు పైగా భూములు బీళ్లుగానే ఉన్నాయి.
2018-19 వానాకాలంలో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ప్రధాన కాల్వ లైనింగు, మేజర్లు, మైనర్లు ఆధునీకరణ చేయడం వలన ఎడమకాల్వ ఆయకట్టుకు నూరుశాతం నీరు అందించే విధంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో వానాకాలం సీజనులో 3లక్షల 61 వేల ఎకరాలకు సాగునీటిని నూరు శాతం ఆయకట్టుకు అందించారు. దీంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆంధ్రా నీటి దోపిడీని అడ్డుకుని తెలంగాణలోని ఎడమకాల్వ రైతులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు రైతులు జేజేలు పలుకుతున్నారు.

అతి తక్కువ నీరు ఉన్నా..
సాగర్ డ్యాంలో అతి తక్కువ నీటి నిల్వలు ఉ న్నా ఎడమకాల్వ రైతులకు యాసంగి నీటిని అం దించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఈనెల 26 నుం చి పంటలకు సాగునీరు విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలో ఎడమకాల్వ, మేజర్లు, మైనర్లు, ఎత్తిపోతల పథకాల కింద కలిపి 3లక్షల 78వేల ఎకరాలు ఉండగా ఈ యాసంగి 3.50 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు అవుతాయ ని అధికారుల అంచనా. కాల్వలు ఆధునీకరించ డం వల్లన చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతో ఏళ్ల తరబడి సాగునీరుకు నోచని చివరి భూములకు సాగునీరు అందుతుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ కృషితోనే...
నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల, సాగర్ ఆధునీకరణ పను లు పూర్తి సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ఆధునీకరణతో మేజరు కాల్వ లు, మైనరు కాల్వలతో చి వరి భూములను సాగునీరు అందుతుంది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చినయి. సాగర్‌ప్రాజెక్టులో తక్కువ నీటి మట్టం ఉన్న దశలో కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పలు మా ర్లు నీళ్లు విడుదల చేసి ఆయకట్టు రైతులకు అండగా నిలిచిన్రు.
- వై.వెంకట్‌రెడ్డి, రైతు, మిర్యాలగూడ

అన్నదాతలకు అండగా...
నాగార్జునసాగర్ ఆయకట్టులో అన్నదాతలకు ఐదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అతి తక్కువ నీరు ఉన్నా ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేస్తూ రైతులకు అండగా నిలిచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయకట్టుకు వరుసగా నీరు వదలడంతో రైతులకు ఆర్థ్దికంగా కలిసొచ్చింది.
-చలికంటి యాదగిరి, రైతు,

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...