పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి


Sun,January 6, 2019 02:12 AM

- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌కే జోషీ
నీలగిరి : పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌కే జోషీ సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి, భద్రతా ప్రణాళిక, వాహనాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ హాల్స్, డిస్ట్రిబ్యూటరీ కౌంటింగ్, స్టోరేజీ కేంద్రాల గుర్తింపు, బడ్జెట్ తదితర ఆంశాలపై రా్రష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచనలి చ్చారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగానాథ్ మాట్లాడుతూ జిల్లాలో 837 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని 7270 పోలింగ్ కేంద్రాలు 1123 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు, మైక్రోఅబ్జార్వర్లు, వీడియోగ్రఫి, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో రవీంద్రనాథ్, డీపీఓ శ్రీకాంత్‌లు ఉన్నారు.

189
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...