పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి


Sun,January 6, 2019 02:11 AM

- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
- మాడ్గులపల్లి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
మాడ్గులపల్లి : గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేజీ-1 అధికారులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారుచేయాలని, పోలింగ్ స్టేషన్‌లను తనిఖీచేయాలని, ద్వితీ య స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ైఫ్లెయింగ్ స్కాడ్స్, సహాయ ఎన్నికల వ్యయనియంత్రణ, కంట్రోల్ రూమ్ ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో నామినేషన్లు సందర్భంగా నామినేషన్ వివరాలను అప్‌లోడ్ చేయడానికి గ్రామపంచాయతీలను క్లస్టర్ల వారీగా సిస్టమ్స్, కంప్యూటర్ ఆపరేటర్లకు బాధ్యతలు కేటాయించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూసమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. పాస్ పుస్తకాలు రాలేదని, భూసమస్యలు ఉన్నాయని రైతులు తెలుపగా తహసీల్దార్, వీఆర్వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ఉన్నతాధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు. సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎన్నికల ప్రత్యేక అధికారి నాగేశ్వర్‌రావు, వేములపల్లి ఎంపీడీఓ శోభారాణి, అధికారులు నరేష్, సంపత్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...