నేడే ఆఖరు


Tue,September 25, 2018 12:13 AM

- ఓటు నమోదుకు ఈ ఒక్కరోజే అవకాశం
- రేపటితో ముగియనున్న ఓటు నమోదు ప్రక్రియ
- నమోదుపై గ్రామాల్లో విస్తృత ప్రచారం
- ఇప్పటి వరకు 43264 అభ్యంతరాలు
- 24,206 నూతన దరఖాస్తుల స్వీకరణ
నీలగిరి : ఊరూరా ఓటరు నమోదు ప్రక్రియ జోరందుకుంది. జిల్లాలో ఓటు లేని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నేడు అఖరు తేది కావడంతో పెద్ద ఎత్తున యువ ఓటర్లు తమ ఓటును బీఎల్‌ఏల వద్ద ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకుంటున్నారు. జనవరి1, 2018 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికి ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందు లో భాగంగా జిల్లాలో అధికారులు ఓటర్ల నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. ఈనెల 10 నుంచి ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులు ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఈనెల 25 వరకు ఓటరుగా నమోదు మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం అవకాశం కల్పించారు. ఓటు నమోదు కోసం సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించేందుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.

గ్రామాల్లో దండోరా...
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్త్రత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో దండోరా వేయించి..ఓటు నమోదుపై ప్రచారం చేస్తోంది. ఇప్పటికే బీఎల్‌ఓల ఓటరు ముసాయిదా జాబితా ఉండగా...ఓటరు నమోదు పత్రాలు అందుబాటులో ఉంచారు. రాజకీయ పార్టీల వద్ద కూడా నమోదు పత్రాలు అందుబాటులో ఉంచారు. వీరు నమోదు చేసి బీఎల్‌ఓలకు అందజేసేలా చర్యలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారం తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పాఠశాల విద్యార్థులతో ఓటరు నమోదు కోసం ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించాలని, అర్హత ఉన్న వారందర్ని ఓటరుగా నమోదు చేయించాలని అధికారులు కోరుతున్నారు. పేర్లు గల్లంతయ్యాయని పోలింగ్ సమయంలో గగ్గోలుపెడితే ప్రయోజనం ఉండదని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బాషదోషాలు లేకుండా దరఖాస్తుదారు స్వయంగా తన వివరాలు పొందుపరిస్తే అదే సమాచారంతో కార్డు మంజూరవుతుంది. ఈనెల 25 అనంతరం ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌ను నిలిపివేస్తుంది. తిరిగి అక్టోబర్ 8న సేవలు మొదలవుతాయి.

జిల్లాకు చేరిన నూతక ఎన్నికల బ్యాలెట్లు
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహనకు సంబందించి పాత బ్యాలెట్ బాక్స్‌లు మరమ్మతులు ఉండడంతో జిల్లా యంత్రాం గం వాటిని వెనక్కి పంపింది. వాటి స్థానంలో బెంగూళూరు నుంచి గురువారం జిల్లాకు కొత్తగా 2600 బ్యాలెట్ యూనిట్లు, 2030 కంట్రోల్ యూనిట్లు, 2200 వీవీ ప్యాడ్స్ వచ్చాయి. రాజకీయ పార్టీ సమక్షంలో జిల్లా యంత్రాం గం వీటిని రికవరీ చేసుకుని బందోబస్తు మధ్య ఈవీఎం గోదాంల్లో వీటిని భద్రపరిచారు. వీ టికి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. మళ్లీ రెండు,మూడ్రోజుల్లో పరిశీలన చేయనున్నారు.

ఓటర్ల నమోదు ప్రక్రియ ఇలా...
జిల్లాలో ఎన్నికల ముసాయిదాకు సంబంధించి ఈనెల 10న జిల్లా యంత్రాంగం ప్రచురించగా ఇప్పటి వరకు జిల్లాలో 43624 క్లయిమ్‌లు రాగా 24203 మంది నూతన ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 12,23,554 మంది ఓటర్లుండగా అందులో 14660 మంది మృతిచెందిన, డబుల్‌ఓటు, షిఫ్ట్ ఆయిన జాబితాలో ఉన్నారు. వీరు గాకుండా మరో 2075 మంది తమ ఓటర్‌కార్డులో తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్ధ్దాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరు గాకుండా నియోజక వర్గం పరిధితో పాటు ఇతర నియోజక వర్గానికి తమ ఓట్లను బదలాయించాలని కోరుతూ 4683 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఓటు నమోదు ఇలా...
- జనవరి 1, 2018 నాటికీ 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కుకు అర్హులు. పోలింగ్‌బూత్‌లలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌ఫొటో, చిరునామా, వయస్సు ధ్రువీకరణపత్రాలు తీసుకెళ్లి ఫారం-6 నింపి ఇవ్వాలి. తెలంగాణ సీఈఓ http.ceo.telangana.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మెనూ కనిపిస్తుంది. అందులో రకరకాల దరఖాస్తులు ఉంటాయి. ఫారం-6 పైన క్లిక్ చేస్తే కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తు వస్తుంది. బాషకు సంబంధించిన గడిపై క్లిక్ చేసి ఇంగ్లీష్ ఎంచుకోవాలి.
- మొదట రాష్ట్రం, జిల్లా, శాసనసభ, పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఎంచుకోవాలి. తర్వాత నూతన ఓటరు నమోదు లేదా ఇతర నియోజక వర్గానికి కార్డును మార్చుకోవడం అనే రెండు ఆప్షన్ల నుంచి ఒక దాన్ని సెలక్టుచేయాలి.
- దరఖాస్తుదారుడి పేరు, చిరునామా వంటి వివరాలు నింపాక, తెలిసిన ఓ ఓటరు పేరుకార్డు నెంబర్ పొందుపరచాల్సి ఉంటుంది.
- అనంతరం ఇతర వివరాలను నింపేసి పక్కన కనిపించే ప్రాంతీయ భాషకు చెందిన గడుల్లో తెలుగు బాషలో ప్రత్యక్షమయ్యే పేరు, ఇతర వివరాలు సరిచూసుకోవాలి. బాష దోషాలు ఉంటే అక్కడే సరి చేసుకోవచ్చు.
- ఫొటో, వయస్సు (10వ తరగతి మార్కుల పత్రం, పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణపత్రం, పాన్‌కార్డు, డ్రైవింగ్‌లైసెన్స్, అధార్‌కార్డు) చిరునామా (గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, విద్యుత్‌బిల్లు, ఆధార్, రేషన్‌కార్డులు, ఇన్‌కంటాక్స్, టెలిఫోన్‌బిల్లు, నల్లాబిల్లు, బ్యాంక్‌పాస్‌బుక్ తదితర)కు సంబంధించి పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఇదేసమయంలో ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ స్పష్టంగా ఇవ్వాలి.
- దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్ని చూసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే రిఫరెన్స్ ఐడీ నెంబర్ ప్రత్యక్షమవుతుంది. ఆ సంఖ్యతో దరఖాస్తు స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కార్డు మంజూరులో జాప్యం జరిగితే హెల్పులైన్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
- కొత్త ఓటు నమోదుకు ఫాం-6, పేరు మార్చుకోవాలంటే ఫాం-7, అక్షర దోషాలు సరిదిద్దుకునేందుకు ఫాం-8, కార్డును ఇతర నియోజకవర్గాలకు మార్పుకు పాం-8(ఏ)ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఫొటోలు, ఇతర ధ్రువీకరణపత్రాలు అప్‌లోడ్ చేసేటప్పుడు కచ్చితంగా వాటి పరిమాణం 100 కేబీలోపు ఉండాలి. లేకపోతే ఆన్‌లైన్‌లో తీసుకోరు

297
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...