ఓటరు నమోదుకు సహకరించాలి


Tue,September 25, 2018 12:12 AM

నీలగిరి : 18ఏళ్లు నిండిన వారు, ఆపైన వయస్సు కలిగి ఉండి ఓటరు జాబితాలో పేరు లేకుంటే నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు సహకరించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు అనితా రాజేంద్ర కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలోవివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాలో నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల తొలగింపులపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులుసందేహాలను ఆమె నివృతి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించడం లో ఎలాంటి అలసత్వం వహించరాదని సూచించారు. ఆన్‌లైన్‌లో ఓటరు నమోదుకు అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్లతో ఓటర్ల జాబితా, ఓటర్ల నమోదుపై సమీక్షించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఈ నెల 15,16న ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రత్యేక క్యాంపెయిన్, 23న ఇంటింటి సర్వే నిర్వహించే కార్యక్రమం చేపట్టామన్నారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్వో రవీంద్రనాథ్, జడ్పీ సీఈవో చంద్రశేఖర్, డీఆర్‌ఎఫ్‌ఓ శాంతారాం, డీఆర్‌డీఈ ఇన్‌చార్జి కోటేశ్వర్‌రావు , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...