సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయం


Tue,September 25, 2018 12:12 AM

నకిరేకల్ : రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడమే టీఆర్‌ఎస్ ధ్యేయమని నకిరేకల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని బాబాసాహెబ్‌గూడేనికి చెందిన 30కుటుంబాలు వేముల వీరేశం సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. పార్టీలో చేరిన వారికి ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని పేర్నొన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక తెలంగాణ దుష్టశక్తులు ఏకమవుతున్నాయని విమర్శించారు. ఎన్ని కూటములు ఏర్పాటైనా రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 100సీట్లు కచ్చితంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీలో చేరిన వారందరూ టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటామని ముక్తకంఠంతో చెప్పారు. పార్టీలో చేరిన వారిలో వరికుప్పల రాములు, గండికోట లక్ష్మీనారాయణ, అంజయ్య, జి.వెంకన్న, నాగరాజు, సైదులు, లింగయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు కొండా వెంకన్నగౌడ్, ఎంపీటీసీ తండు మమత, నాయకులు వీర్లపాటి రమేష్, వంటెపాక సరోజ, పెండెం సదానందం, కందాల శంకర్‌రెడ్డి, భూపతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...