కంటివెలుగు ముమ్మరం


Tue,September 25, 2018 12:12 AM

నీలగిరి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమం జిల్లాలో 25వరోజు సోమవారం ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లాలో మహిళలు పెద్ద ఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 37 వైద్య బృందాలు సోమవా రం 5,690మందికి పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటివరకు 1,42,785 మందికి రోగులకు వైద్య బృందం సభ్యులు పరీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పానగల్ అర్బన్ హెల్తు సెంటర్ నిర్వహిస్తున్న స్వరాజ్ భవన్‌లోని క్యాంపును డీఎంహెచ్‌ఓ కరంటోతు బానుప్రసాద్‌నాయక్ పరిశీలించారు. అక్కడ రోగులతో మాట్లాడి, సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి కళ్లద్దాలను అందజేశారు. స్ధానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వైద్య పరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి అద్దాలను, మందులను పంపిణీ చేశా రు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 32 చోట్లా, పట్టణ ప్రాం తాల్లో 5 చోట్టా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 5,690 మందికి వైద్య పరీక్షలు నిర్వహించా రు. ఇందులో మొత్తం 2505 (ఇప్పటి వరకు 62432) మంది పురుషులు, 3185 (ఇప్పటి వరకు 81893) మంది స్త్రీలు 15మంది ఇతరులు పాల్గొనగా 1018 (ఇప్పటి వరకు 31363) మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కంటి అద్దాలు అందజేశారు. మరో 1128 (ఇప్పటి వరకు35461) మంది రెండు కండ్లల్లో రెండు చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూ డు వారాల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర అసుపత్రికి 498 (ఇప్పటి వరకు 14229) మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. కార్యక్రమాల్లో మెడికల్ అఫీసర్లు, క్యాం పు మెడికల్ అఫీసర్లు, క్యాంపు కోఅర్డినేటర్లు, అఫ్తాలిస్టులు ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఊర్లోకి వచ్చి కళ్లద్దాలివ్వడం ఎప్పుడు జరగలేదు
గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకా లు ప్రవేశ పెట్టడమే గాక అమ లు చేస్తోంది. దీనిలో భాగంగా నిర్వహిస్తున్న కంటివె లుగు కార్యక్రమం పట్ల పేద ప్రజ లు సంతోషిస్తున్నారు. నాకు కేసీఆర్ సార్ దేవుడు. నేను కళ్లద్దాలు పెట్టుకోవడంతో కంటి సమస్య పరిష్కారమైంది. నాలాంటి చాలా మం దికి కేసీఆర్ సార్ దేవుడు.
-భిక్షం, కంచనపల్లి, నల్లగొండ మండలం

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...