యాదాద్రిలో భక్తుల కోలాహలం


Mon,September 24, 2018 03:42 AM

-శ్రీవారి ఖజానాకు రూ. 8,02,782 ఆదాయం
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇష్టదేవుడి దర్శనం.. మొక్కు పూజలకు హాజరైన భక్తులతో ఆదివారం యాదాద్రి పంచనారసింహ క్షేత్రం నిండుకుంది. శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిశాయి. సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. శ్రీవారి ఖజానాకు రూ. 8, 02, 782 ఆదాయం సమకూరింది. తెల్లవారు జాము మూడు గంటల నుంచే ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...