నేడు గడప గడపకు ఓటు నమోదు


Sun,September 23, 2018 02:48 AM

- అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ నారాయణరెడ్డి
నీలగిరి : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈనెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత జిల్లావ్యాప్తంగా నమోదుకు, అభ్యంతరాలకు వచ్చిన దరఖాస్తులను ఈఆర్‌ఓ నెట్‌లో అప్‌లోడ్ చేయాలని జేసీ కలెక్టర్ సీ.నారాయణరెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులు, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటరు ప్రత్యేక జాబితా సవరణలో భాగంగా ఈనెల 10నుంచి 25 వరకు నమోదు, అభ్యంతరాలు, తొలగింపులు, సవరణలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 01, 2018 నాటికి 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటుకు దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. 23న గడప గడపకు ఓటు నమోదు కార్యక్రమం విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు,గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి 18ఏండ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని, అలాగే ఓటర్ జాబితాలో తొలగింపులు, సవరణలు చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...