పంటలకు ప్రాణం


Sat,September 22, 2018 12:20 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: వానాకాలం సీజన్‌లో మెట్టపంటలకు ప్రధాన ఆధారం వర్షమే. వర్షాన్ని నమ్ముకోని పంటలు సాగుచేసే రైతులకు వరణుడు మొహం చాటేస్తే ఆ యేడు ఎవుసం అధోగతి పాలే. అయితే గడిచి న నాలుగేల్లు రైతాంగానికి వ్యవసాయ రంగంలో అలాం టి గడ్డు పరిస్థ్ధితులు పెద్దగా ఏర్పడలేదనే చెప్పవచ్చు. దీని కి తోడు తెలంగాణ ప్రభుత్వం సైతం అన్నదాతకు పూర్తి స్థ్ధాయిలో సహకరించటంతో వ్యవసాయం సాఫీగా సాగుతుందనవచ్చు. ఇదిలాఉండగా ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తల ప్రకటనల ఆధారంగా..రైతుల ఆశలకనుగుణంగా ముందస్తు వర్షాలు పడ్డాయి. అయితే జులై నెలలో కాస్త ఆలస్యమైనప్పటికీ ఆగష్టులో పడ్డ వర్షాలకు మెట్టపంటలకు జీవం పోయగా మరో నెల రోజుల జాప్యం అనంతరం తాజాగా కురుస్తున్న వర్షాలు ఆ పంటలకు ప్రాణం పోసినట్లు అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక అత్యధికంగా సాగు చేయబడ్డటువంటి పత్తి పంటకు ఈ ఏడాది ఢోకా లేకపోగా తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా పడే ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేయనున్నట్లు వారు చెప్తున్నారు.

జిల్లా అంతటా వర్షం
అల్పపీడనం ప్రభావం నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లా అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 31మండలాల్లో ఇప్పటి వరకు అన్ని మండలా ల్లో వర్షం పడగా కొన్ని మండలాల్లో మోస్తారుగా మరి కొన్ని మండలాల్లో భారీగా కురిశాయి. గడిచిన 3 రోజు ల్లో 13 మండలాల్లో భారీ వర్షం కురవగా 18 మండలా ల్లో మోస్తారు వర్షం కురిసింది. ఇప్పటివరకు ఈ సీజన్ లో 458.1 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 358.5 మి.మీ. మాత్రమే పడటంతో ఇంకా 22 శాతం లోటులో ఉంది. అయితే సీజన్ ఆసాంతం తిప్పర్తి, నల్లగొండ, త్రిపురారం, వేములపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదవగా శాలిగౌరారం, గుర్రంపోడు, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, పీఏపల్లి, దేవరకొండ, నేరడుగొమ్మ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లోను చిరు జల్లుల నుంచి మోస్తారు వర్షం పడింది.

ఇక పత్తికి ఢోకా లేనట్లే...
వానాకాలంలో ప్రధానంగా వర్షాధార పంటలే ఎక్కువగా ఉండడంతో వర్షం కోసం రైతుల ఎదురు చూస్తుంటారు. వర్షంపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో ఈ ఏడాది సాధారణ సాగుకు మించి రైతులు మెట్ట పంటలను సాగు చేశారు. 3,14,398 హెక్టార్లలో ఆయా పంటలు సాగు కావాల్సి ఉండగా 63002 హెక్టార్ల సాధారణ వరిసాగు అంచనా మినహాయిస్తే మిగిలిన వన్ని మెట్టపంటలే సాగు కానున్నాయి. అయితే జిల్లా వ్యాప్తం గా ఇప్పటివరకు 3,15,054 హెక్టార్లలో ఆయా పం టలు సాగు కాగా అందులో మెట్ట పంటలు 2,51,396 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 2,38,507 హెక్టార్లు ఉన్నాయి. ప్రధానంగా పత్తి పంటనే 2,23,930 హెక్టార్ల సాధారణ సాగుకు మించి 2,31,325 హెక్టార్లలో రైతులు సాగు చేయబడ్డాయి. అయితే గడిచిన నాలుగు రోజులు గా ఆయా ప్రాంతంలో కురిసిన వర్షాలు ఈ పంటలకు మేలు చేయనున్నాయి. జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా వర్షాలు లేకపోవటంతో పత్తి చేలు వాడు దశకు చేరుకోగా తాజాగా కురుస్తున్న వర్షాలతో చేలన్ని నిఘనిఘలాడుతుండగా పత్తి చేలతోపాటు కంది, పెసర, వేరుశనగ పంటలతో పాటు వరి పైరుకు సైతం ఈ వర్షాలు ఉపయోగపడనునున్నాయి.

మెరుగైన దిగుబడికి శాస్త్రవేత్తల సూచనలు...
నెలరోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షం లేకపోవడంతో ప్రధానంగా పత్తి వాడు దశకు వచ్చినప్పటికి తాజాగా కురుస్తున్న వర్షాలు వాటికి జీవం పోసినట్లుగా ఉన్నది. అయితే ప్రస్తుతం కురిసిన వర్షాలతో పాటు ఇంకా కొనసాగితే తీసుకోవాల్సిన జాగ్రతలను ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త జి. నరేందర్ రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరికి తాటాకు తెగులు, కాండం తొలుపు పురుగు, ఆకుముడత పురుగు, ఆశించే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆయన రైతులకు నివారణ చర్యలు సూచించారు.

నివారణ చర్యలు
- తాటాకు తెగులు నివారణకు 2 మి.లీ. క్వినాల్ పాస్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిపాస్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
- కాండం తొలుచు పురుగు నివారణకు 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జీ గుళికలను ఎకరా పొలంలో వేసుకోవాలి.
- ఆకుముడత పురుగు నివారణకు 0.3 మి.లీ. క్లోరాంటానిప్రోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
పత్తిలో తామర పురుగు, తెల్లదోమ ఆశించే అవకాశం ఉంటుంది. ఇందుకు నివారణ చర్యలు..
- తామర పురుగు నివారణకు 2.మి.లీ. పిప్రోనిల్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
- తెల్లదోమ నివారణకు 2 మి.లీ. ట్రైజోపాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
- రాత్రి చలి వాతావరణం వలన బూజు తెగులు ఆశించనుంది. దీని నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

276
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...