కులమతాలకతీతంగా మొహర్రం వేడుకలు


Fri,September 21, 2018 01:51 AM

మిర్యాలగూడ టౌన్: ముస్ల్లింలు ఎంతో పవిత్రంగా భావించే మాసాల్లో మొహర్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ముస్ల్లింలు వారి సాంప్రదాయ అన్ని పండుగలను సంతోషంగా జరుపుకుంటారు. కానీ మొహర్రం పండుగను మాత్రం బాధతో జరుపుకుంటారు. ఈ పం డుగను పట్టణాలు, గ్రామాల్లో హిందు, ముస్ల్లింలతోపాటు అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకుంటారు. మొహర్రం నెలలో 10రోజులపాటు పీర్లను ఊరేగిస్తారు.

మొహర్రం ప్రత్యేకత
క్రీ.శ.1400 సంవత్సరంలో మత ప్రచారం చేస్తున్న సమయంలో కర్భాలా అనే ప్రాం తంలో ముస్ల్లిం మతస్థాపకుడైన మహ్మద్ ప్రవక్త మనువడైన హుస్సేన్ మృతి చెందాడు. ఆయన చనిపోయిన రోజును మొహర్రం పం డుగగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా షి యా తెగకు చెందిన వారు జరుపుకుంటారు.

పది రోజుల పాటు పీర్ల ఊరేగింపు
మొహర్రం నెలలో 10రోజులపాటు పీర్లను ఊరేగిస్తూ పండుగను జరుపుకుంటారు. పీర్ల ను తయారు చేసి ఒక కొట్టంలో ఉంచి రోజూ ఊరేగిస్తారు. 9 రోజులపాటు షర్బత్‌ను పంచిపెట్టడంతోపాటు విచిత్ర వేషధారణతో సా యంత్రం పూట అలౌ ఆడతారు. 10వ
రోజు పీర్లను బావిలో నిమజ్జనం చేస్తారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...