జిల్లాకు చేరిన ఈవీఎంలు


Fri,September 21, 2018 01:51 AM

నీలగిరి : త్వరలో జిల్లాలో జరుగనున్న జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వాహణకు సంబంధించి 2600 ఈవీఎం బాక్సులు గురువారం కలెక్టరేట్‌కు చేరాయి. వాటిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అఖిలపక్ష పార్టీ నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాములో భద్ర పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాత బ్యాలెట్ బాక్స్‌లు మరమ్మతులు ఉండడంతో జిల్లా యంత్రాంగం వాటిని వెనక్కి పంపి కొత్తవి తీసుకురావడం జరిగిందన్నారు. బెంగూళూరు నుంచి జిల్లాకు కొత్తగా 2600 బ్యాలెట్ యూనిట్లు, 2030 కంట్రోల్ యూనిట్లు, 2200 వీవీ ప్యాడ్స్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నేతల సమక్షంలో జిల్లా యం త్రాంగం వీటిని రికవరీ చేసుకుని బందోబస్తు మధ్య ఈవీఎం గోదాంల్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్వో రవీంద్రనాథ్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, అఖిలపక్షాల నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, ఎల్.వి.యాదవ్, పుచ్చకాయల నర్సిరెడ్డి, బక్కపిచ్చయ్య పాల్గొన్నారు.

23న ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపు
ఈ నెల 23న ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాలో భాగంగా ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపును చేపట్టనున్నట్లు తెలిపారు. 23న పోలింగ్ బూత్ లెవల్ అధికారి పోలింగ్ కేంద్రాల్లో ఉంటున్నందున ఓటరుగా నమోదు చేసుకునే వారు, తప్పొప్పులు సరిచేసుకునేవారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

214
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...