నయనోత్సాహం..


Fri,September 21, 2018 01:51 AM

నీలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో 24వ రోజు గురువారం జరిగిన కంటి వైద్య పరీక్షల్లో పాల్గొన్న ప్రజలు నయానందం పొందారు. జిల్లాలో ఎక్కువగా మహిళలు పెద్ద ఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్కువగా వృద్ధులు వైద్య పరీక్షలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 37 వైద్య బృందాలు గురువారం 5870మందికి పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటివరకు 1,36,202 మందికి వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని లైన్‌వాడ అర్బన్ హెల్త్త్ సెంటర్‌లో నిర్వహిస్తున్న క్యాంపును డీఎంహెచ్‌ఓ కరంటోతు భానుప్రసాద్‌నాయక్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి, సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి కళ్లద్దాలు అందజేశారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వైద్య పరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి ఆద్దాలు, మందులను పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 32 చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 5 చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 5870 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 2626(ఇప్పటి వరకు59,553పురుషులు), 3243(ఇప్పటి వరకు 76634) మంది స్త్రీలు పాల్గొనగా 1027(ఇప్పటి వరకు 29657) మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కంటి ఆద్దాలు అందజేశారు. మరో 1075 (ఇప్పటి వరకు 33660) మంది రెండు కండ్లల్లో రెండు చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూడు వారాల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర దవాఖానకు 421(ఇప్పటి వరకు 13705) మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. ఈరోజు జరిగిన పరీక్షల్లో 3347(ఇప్పటి వరకు 59180) మందికి ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. కార్యక్రమాల్లో మెడికల్ అఫీసర్లు, క్యాంపు మెడికల్ అఫీసర్లు, క్యాంపు కోఅర్డినేటర్లు, అఫ్తాలిస్టులు ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...