ఫలించిన బయోమెట్రిక్


Thu,September 20, 2018 12:59 AM

- ఎంజీయూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా అమలు
- తరగతుల్లో పెరిగిన విద్యార్థుల హాజరుశాతం
- రాష్ట్రంలోనే ఎంజీయూలో ప్రథమం
ఎంజీ యూనివర్సిటీ: విద్యార్థుల హాజరుశాతం పెంచేలా ఎంజీయూనివర్సిటీ యంత్రాంగం ప్రవేశపెటిన బయోమెట్రిక్ విధానం సత్ఫలితాలిస్తోంది. గతంలో 25శాతం హాజరు ప్రస్తుతం 95శాతానికి పెరగడం ఇందుకు నిదర్శ నం. విద్యార్థుల రాకతో వర్సిటీ పరిసరాలు కళకళలాడుతున్నాయి. క్యాంపస్‌లో వివిధ కోర్సుల్లో 2,875 మం దికి పైగా విద్యార్థులు ఉండగా.. ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ప్రతీరోజు బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు.
వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సే న్ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించారు. అనుకున్న వెంటనే ఎంజీయూలో అమలు చేశారు. విద్యార్థుల తోపాటు బోధన, బోధనేతర సిబ్బంది హాజరు సైతం బయోమెట్రిక్ అనుసంధానం చేశారు. ప్రతి విద్యార్థి 75శా తం హాజరు ఉంటేనే ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పరీక్షలకు అనుమతి ఇస్తామని వీసీ, రిజిస్ట్రార్‌తోపాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు సూచించారు. హాజరులేని వారిని పరీక్షలు రాయనివ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ధర్నాలు, ఆందోళనలు చేసి నా అదే పద్ధతి కొనసాగిస్తుండడంతో విద్యార్థుల్లో మార్పువచ్చింది. నిత్యం తరగతులకు హాజరవుండడంతో తరగతి గదులు కళకళలాడుతున్నాయి.

హాజరులేకుంటే హాస్టల్ అడ్మిషన్ రద్దు...
యూనివర్సిటీ కళాశాల హాస్టల్ విద్యార్థులు తరగతులకు గైర్హాజరైతే హాస్టల్ అడ్మిషన్ రద్దు చేస్తామని వీసీ ఆదేశాలు జారీచేశారు. దీనికి తోడు కళాశాలల పనివేళల్లో హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలతోపాటు ప్రత్యేక చర్యలు తీసుకోవడం తో హాజరు శాతం పెరిగింది. ఎంజీయూలోనే పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని వర్సిటీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు యూనివర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ యూజీ, పీజీ, ఇతర కళాశాలల్లోనూ బయోమెట్రిక్ అమలుదిశగా యాజమాన్యాలు శ్రీకారం చుట్టాయి.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...