584.20 అడుగుల వద్ద సాగర్‌నీటి మట్టం


Thu,September 20, 2018 12:59 AM

నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ బుధవారం నాటికి 584.20 అడుగుల వద్ద నీరు నిల్వ వుంది. నాగార్జునసాగర్ డ్యాం నుంచి పవర్‌హౌస్ ద్వారా నీటి విడుదల లేదు, ఎడమకాల్వ ద్వారా 9,767 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 3,259 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డిటీ (డైవర్షన్‌టన్నెల్) గేట్సు ద్వారా 10 క్యూసెక్కులతో మొత్తం 15,436 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నీటి విడుదల కొనసాగుతోంది. 312.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 295.1270 టీఎంసీల నీరు నిల్వ వుంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 875.00 అడుగుల వద్ద 163.5820 టీయంసీల నీరు నిల్వ వుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేదు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...