ప్రజా పంపిణీ సరుకులు పారదర్శకంగా అందజేయాలి: జేసీ


Thu,September 20, 2018 12:59 AM

నీలగిరి: పౌర సరఫరాలశాఖలో నిరుపేదలకు ప్రభుత్వం అందజేస్తున్న సరుకులను పారదర్శకంగా అందజేయాలని జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా రేషన్‌డీలర్లకు పెంచిన కమీషన్ బకాయిలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల డీలర్లకు క్వింటాల్‌కు అందిస్తున్న కమిషన్‌ను 20 నుంచి 70 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. దీని ప్రకారంగా అక్టోబర్ 2015 నుంచి ఆగస్టు 2018 వరకు ఉన్న బకాయిలను 820 మం ది డీలర్లకు 5.26 కోట్లు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన నూతన విధానాల వల్ల రేషన్ డీలర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమిషన్‌ను పెంచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ఉదయ్‌కుమార్, డీఎం నాగేశ్వర్‌రావు, ఏఎస్‌ఓ నిత్యానందం, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...