కంటివెలుగు @ 1,30,128


Thu,September 20, 2018 12:58 AM

- 23వ రోజు 5,740 మందికి పరీక్షలు
- 1,070 కళ్లద్దాలు పంపిణీ
- 407 మందికి ఆపరేషన్‌కు రెఫర్
నీలగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో 23వ రోజు కొనసాగింది. బుధవారం జరిగిన కంటి వైద్య పరీక్షల్లో పాల్గొన్న ప్రజలు నయానందం పొందారు. జిల్లాలో ఎక్కువగా మహిళలు పెద్ద ఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్కువగా వృద్ధులు వైద్యపరీక్షలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 37 వైద్య బృం దాలు బుధవారం 5,740 మందికి పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటివరకు 1,30,128మందికి రోగులకు వైద్య బృందం సభ్యులు పరీక్షలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వైద్యపరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి అద్దాలను, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణప్రాంతాల్లో 32 చోట్లా, పట్టణ ప్రాంతాల్లో 5 చోట్టా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 5,740 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొత్తం 2,579(ఇప్పటి వరకు 56,830 పురుషులు, 3161(ఇప్పటివరకు 73,284) మంది స్త్రీలు పాల్గొనగా 1,070(ఇప్పటి వరకు 28,409) మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కంటి అద్దాలు అందజేశారు. మరో 1,018 (ఇప్పటి వరకు 32,370) మంది రెం డు కండ్లల్లో రెండు చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూడు వారా ల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి 407(ఇప్పటివరకు 13,278) మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. ఈరోజు జరిగిన పరీక్షల్లో 3,245(ఇప్పటి వరకు 56,071) మందికి ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ అఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, అఫ్తాలిస్టులు ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

203
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...