ఉద్యోగ క్రమబద్ధీకరణ నిర్ణయంపై ఆర్టిజన్ కార్మికుల హర్షాతిరేకాలు


Thu,September 20, 2018 12:58 AM

- సీఎం కేసీఆర్, ఎంపీ కవితల ఫ్లెక్సీకి పాలాభిషేకం
నల్లగొండక్రైం : విద్యుత్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధ్దీకరించాలని హైకోర్టు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లావ్యాప్తంగా బుధవారం ఆర్టిజన్ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎంపీ కవితల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌వీకేఎస్ జిల్లా సెక్రటరీ కరెంట్‌రావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న కార్మికుల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది కార్మికులను క్రమబద్ధీకరించడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని టీఆర్‌వీకేఎస్ చేసిన పోరాటాల ఫలితంగానే సీఎం కేసీఆర్, ఎంపీ కవిత చొరవతో కార్మికులను రెగ్యూలర్ చేస్తూ 2017లో జీఓ వచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పు కార్మికులకు అనుకూలంగా రావడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌వీకేఎస్ నాయకులు జంజిరాల వెంకన్న, రాములు, ఊశయ్య, ఉమా మహేష్, లింగస్వామి, పెద్దులు, శేఖర్, ఉమ, అరుణ, కోటి, రవి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...