కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు


Thu,September 20, 2018 12:58 AM

నీలగిరి : ప్రణయ్ కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లను కలిశారు. ముందుగా ఎస్పీ రంగనాథ్‌ను కలిసిన వారు ఆయనతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పూర్తిగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. దోషులకు కఠిన పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల ప్రకారం రూ.8.5 లక్షలు ఆర్థ్ధిక సాయం అందించాల్సిన నేపథ్యంలో ఇప్పటికే రూ.4 లక్షల 12,500లు అందజేశామని మిగతా మొత్తాన్ని ఛార్జిషీట్ వేసే నాటికి అందజేయనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబం కోరిన ప్రకారంగా ఇంటిస్థలంతోపాటు వ్యవసాయ భూమిని సైతం ఇస్తామని తెలిపారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి అమృత వర్షిణి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తమ కుటుంబాన్ని ఆదుకుంటుందన్నారు. కలెక్టర్, ఎస్పీలు పూర్తి భరోసా ఇచ్చారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు విద్యార్హత తదితర వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. కేసును ఫాస్టు ట్రాక్ కోర్టు ద్వారా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. జిల్లా యంత్రాంగం తమకు సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఆమె వెంట మామ బాలస్వామి, మరిది అజయ్‌తోపాటు కుటుంబ సభ్యులున్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...