యాదాద్రిలో శాస్ర్తోక్తంగా నిత్యపూజలు


Thu,September 20, 2018 12:58 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శాస్ర్తోక్తంగా నిత్యపూజలు జరిగాయి. బుధవారం వేకువజామున స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్యమనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కళ్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టిక్కెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాలపాటు పూజలో పాల్గొనే పూజలకు ఆదరణ పెరుగుతున్నది.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...