రైతులకు సకాలంలో రుణాలివ్వాలి


Thu,September 20, 2018 12:58 AM

- బ్యాంకర్లతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నీలగిరి : రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లు, రైతులతో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు త్రైమాసిక సమీక్ష సమావేశం మూడు నెలలకోసారి నిర్వహించి లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేయాలన్నా రు. కేటాయింపులో అలసత్వం వహించకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలపై సమీక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. రుణాల కేటాయింపులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఎంపీ గుత్తా మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేయొ ద్దన్నారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఎల్‌డీఎం సూర్యం, ఏజీఎం దయామృత, ఆర్‌బీఐ అధికారి శ్రీధర్, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

216
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...