విద్యుత్ ఉద్యోగుల సంబురాలు


Wed,September 19, 2018 02:34 AM

నల్లగొండక్రైం : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల (అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీస్‌ను క్రమబద్దీకరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. విద్యుత్ శాఖలో ఎంతో కాలంగా పని చేస్తున్న ఆర్టిజన్ల సర్వీస్‌లను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో 24 జూలై, 2017న నాలుగు విద్యుత్ సంస్థలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే ఆర్టిజన్ల సర్వీస్‌ను క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అవుట్‌సోర్సింగ్ కార్మికుల క్రమద్దీకరణకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది.

ఉమ్మడి జిల్లాలో 1399 మంది
కోర్టు తీర్పు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న 1399 మంది ఆర్టిజన్ కార్మికుల రెగ్యులరైజేషన్ పూర్తి కానుంది. నల్లగొండలో 673 మంది, యాదాద్రిభువనగిరిలో 276, సూర్యాపేటలో 450 మందికి ప్రయోజనం కలుగనుంది.

కార్మికుల సంబురాలు
తమ రెగ్యులరైజేషన్‌కు ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో కార్మికులు మంగళవారం నల్లగొండ ఎస్‌ఈ కార్యాలయంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా 1104 యూనియన్, జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటయ్య మాట్లాడుతూ వివిధ యూనియన్లను కలుపుకొని కార్మికుల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వాన్ని కోరగా సీఎం స్పందించి ఈ విషయమై విద్యుత్‌శాఖను ఆదేశించారన్నారు. 25 వేల మంది కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ కార్మికులను విలీనం చేస్తు 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే కొందరు దీనిపై కోర్టులో పిటిషన్ వేయగా ఆ ప్రక్రియ నిలిచిందని, కోర్టు సదరు పిటిషన్ కొట్టివేయడంతో ప్రస్తుతం రెగ్యులరైజేషన్‌కు ఉన్న అడ్డంకి తొలగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ కార్మికులకు 1104 యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సహకరించిన సీఎం కేసీఆర్, ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, గోపాల్‌రావు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పద్మారెడ్డి, కార్యదర్శి సాయిబాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు రవినాయక్, లింగస్వామి, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్, నాగరాజు, తదితరులు ఉన్నారు.

నంది కొండ, పెద్దఅడిశర్లపల్లిలో..
నందికొండ, పెద్ద అడిశర్లపల్లి : నాగార్జునసాగర్ పైలాన్ జెన్‌కో కార్యాలయం వద్ద ఆర్టీజన్స్ ఉద్యోగులు, పెద్ద అడిశర్లపల్లి పుట్టంగండి పంప్‌హౌస్‌లో పని చేస్తున్నా కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో యాసయ్య, మధుసుధన్‌రెడ్డి, నర్సింహరాజు, నాగేశ్వరరావు, అలీ, హరిప్రసాద్, దారబాబు, శ్రీను, పద్మ, దండు రాము, నాచాయణ, ప్రతాప్ గణేష్, రాణి, పద్మ, సాయిదుర్గ, రాధిక, కేఎల్‌ఎన్ చారి, రాజన్, రంగా, ఆశోక్, మోతీలాల్, సరియా, చందా, హరిలాల్, తదితరులు పాల్గొన్నారు.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...