మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ


Thu,September 13, 2018 12:47 AM

సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందించడం పర్యావరణ పరిరక్షణకు శుభపరిణామమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.7లక్షల నిధులతో మట్టి వినాయకులను 34వార్డులకు మంత్రి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన పాలక మండలి వచ్చిన తరువాత ప్రతి ఏటా పట్టణంలోని అన్ని వార్డులకు మట్టి వినాయకులను ఉచితంగా అందించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా మున్సిపాలిటీ వారు ముందడుగు వేయడం శుభపరిణామమని, దీనిని మిగిలిన ప్రజలు కూడా ఆచరించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని కలుషుతం చేస్తాయని తెలిపారు. వాతావరణంలోని నీరు, భూమి కాలుష్యం కాకుండా ఉండాలంటే మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. విగ్రహాల పంపిణీ కంటే ముందుగా వినాయక విగ్రహాలకు మంత్రి ప్రత్యేక పూజులు చేశారు.

అనంతరం విగ్రహాలను పంపిణీ చేశారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికాప్రకాష్, మున్సిపల్ కమిషనర్ ఎన్.శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు గండూరి ప్రకాష్, టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్లు గండూరి పావని, గునగంటి వంశీ, జ్యోతికరుణాకర్, నిమ్మల వెంకన్న, కల్లేపల్లి మహేశ్వరి, బైరబోయిన శ్రీను, కుంభం రజిత, బాణాల విజయ్‌కుమార్, తండు శ్రీనివాస్‌గౌడ్, తాహేర్‌పాష, పోలెబోయిన రాధిక, చల్లమల్ల నర్సింహ, డాక్టర్ వనజ, కో ఆప్షన్ సభ్యురాలు స్వరూపారాణి, నేరెళ్ల మధుగౌడ్, బాలసైదులుగౌడ్ పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...