సహకార సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు


Thu,September 13, 2018 12:47 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరే సహకార రంగంలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శక సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల చివరి నాటికి అన్ని బ్యాంకులను కంప్యూటరీకరించి లావాదేవీలు సహకార వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. ఉమ్మడి జిల్లాలో 107సంఘాలు ఉండగా వీటిలో ఇప్పటికే 80సంఘాల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెల చివరి నాటికి ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మందికి ఆన్‌లైన్ సేవలు అందనున్నాయి. సహకార సంఘల్లో కంప్యూటరీకరణ విధానాన్ని దేశంలో తెలంగాణ రాష్ట్రమే ప్రప్రథమంగా అమలు చేస్తుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు నీతి అయోగ్ సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి.

సహకార వ్యవస్థ్ధ...
వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతాంగానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆవిర్భవించినదే సహకార సంస్థ్ధ. కాలాను గుణంగా అనేక వాణిజ్య బ్యాంకులు మనుగడలోకి వచ్చినా రైతాంగానికి మాత్రం పూర్తి స్ధాయిలో ఆర్థ్ధిక సహకారం చేస్తున్నది మాత్రం సహకార సొసైటీలే. ఇవి సర్కార్ కనుసన్నల్లో నడుస్తున్నందున బ్యాంకులతో పోలిస్తే రైతులకు చేయూత నివ్వడంలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని బలోపేతం చేయడంతో రైతులకు మరింత సహకారం అందుతున్నది. అయితే ఈ ప్రక్రియలో మరింత పారదర్శక తీసుకు రావలన్న ఉద్దేశంతో ఈ రంగలో ఆన్‌లైన్ విధానం అమలు చేస్తూ అన్ని సొసైటీలను కంప్యూటరీకరణ చేస్తున్నది. ఈ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యి వచ్చేనెల తొలివారం నుంచి ప్రతి వ్యవహారం ఆన్‌లైన్‌లో నమోదు కానుంది.

జిల్లాలో 107సంఘాలు....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహాకార రంగానికి సంబంధించి 107 ప్రాథమిక సహాకార సోసైటీలు ఉన్నాయి. ప్రతి సోసైటీకి పాలక వర్గంతో పాటు సీఈఓ బాధ్యులుగా ఉండి వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే వాణిజ్య బ్యాంకుల తరహాలోనే సహాకార రంగంలోనూ ఆన్‌లైన్‌సేవలు అమలు చేస్తున్నందున ఆయా సోసైటీలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో కంప్యూటరీకరణ పనులు ప్రారంభమై 80సోసైటీల్లో పూర్తయ్యాయి. ఈ సోసైటీల్లో ఇప్పటికే ఆన్‌లైన్ సేవలు ప్రారంభం కాగా మిగిలిన27సోసైటీల్లో ఈనెల 20నాటికి కంప్యూటరీకరణ పనులు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సెప్టెంబర్ నుంచి ఆన్‌లైన్ సేవలు...
ఈనెల చివరి నాటికి కంప్యూటరీకరణ పనులు పూర్తి కాగానే సెప్టెంబర్ నుంచి అన్ని సోసైటీల్లోనూ ఆన్‌లైన్‌సేవలు ప్రారంభం కానున్నాయి. అంటే ఆయా ప్రాథమిక సహాకార సంఘాల్లో రైతులకు కావాల్సిన ఇన్‌ఫుట్స్ విక్రయాలు.. రుణాలు ఇచ్చినా... రీకవరీ చేసినా ఇలా ఏ తరహా లావాదేవిలైనా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంది. ఇందుకు గాను ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రతి అంశం అందులో పొందుపర్చనున్నారు. జిల్లాలో 1.50లక్షల మంది రైతులు ఉండగా వారి వివరాలతోపాటు వారికి సంబంధించిన లావాదేవీలు సైతం ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రాథమిక సహాకార సంఘాలతోపాటు జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్, రాష్ట్ర సహాకార బ్యాంక్ యంత్రాంగం ప్రతి అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది.

పారదర్శకత కోసమే ...
సహాకార బ్యాంకింగ్ సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సోసైటీలను కంప్యూటరీకరిస్తూ ఆన్‌లైన్ సేవలను అమలు చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సహాకార శాఖల్లో తొలత తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతుంది. ఇప్పటికే 80సంఘాలు కంప్యూటరీకరణ పూర్తి చేయడంతో ఆయా సోసైటీల్లో జరిగేటటువంటి లావాదేవిలను పలు రాష్ర్టాల ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి పరిశీలించి అభినందించారు. నీతి అయోగ్ సైతం ఈ పథకానికి సంపూర్ణ మద్దతు తెలిపింది. సహాకార వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వచ్చిన నిధులు, చేసేటటువంటి పనులు అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను తొలి సారిగా ఈ సహాకార రంగంలో ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది. ఇదిలా ఉండగా 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అడిట్ రిపోర్టులు సైతం కంప్యూటరీకరణలో భాగంగానే అధికారులు పరిశీలించారు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...