ఉద్యమంలా కంటి పరీక్షలు


Thu,September 13, 2018 12:46 AM

నీలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో 19వ రోజు బుధవారం కంటి పరీక్షలు ఉద్యమంలా కొనసాగాయి. మహిళలు, వృద్ధ్దులు భారీగా శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 37వైద్య బృందాలు బుధవారం 5207 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,05,036 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 32చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 5చోట్ల కంటి పరీక్షలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 5207 మందికి పరీక్షలు నిర్వహించగా 2393 పురుషులు, 2814 మంది స్త్రీలు పాల్గొన్నారు. వీరిలో 641 మంది దగ్గర, దూరం చూపు సమస్య ఉన్నందున కళ్లద్దాలు అందజేశారు. మరో 645 రెండు కండ్లల్లో రెండు చూపు సమస్య ఉన్నట్లు గుర్తించగా వారికి మూడు వారాల్లో కళ్లద్దాలను అందజేయనున్నారు. వివిధ కారణాలతో జిల్లా కేంద్ర దవాఖానలో 316 మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, ఆఫ్తాలమిస్టులు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...