ప్రచార హోరు..


Wed,September 12, 2018 01:16 AM

-మిర్యాలగూడ గులాబీ మయం
-ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తా
-మిర్యాలగూడను టీఆర్‌ఎస్ కంచుకోటగా మారుస్తా
-ఎమ్మెల్యే అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా మంగళవారం మిర్యాలగూడకు వచ్చిన భాస్కర్‌రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు పదివేలకుపైగా ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారు నుంచి పది కి.మీ.ర్యాలీగా మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్నారు. వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కోలాట బృందాలు, డీజే చప్పుళ్ల హోరు కొనసాగింది. మహిళలు హారతి ఇచ్చి స్వాగతించగా.. మిర్యాలగూడ పట్టణంలో పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రజలు పలికిన అపూర్వ స్వాగతానికి వారికి ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి మిర్యాలగూడకు వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావుకు మంగళవారం కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి అపూర్వస్వాగతం పలికారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారు 10 వేల మంది పార్టీ కార్యకర్తలు తరలిరాగా.. మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామశివారులో భాస్కర్‌రావుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడకు చేరుకోగానే వందలాదిమంది మహిళా కార్యకర్తలు భాస్కర్‌రావుకు బొట్టుపెట్టి, హారతులిచ్చి స్వాగతం పలికారు.

కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఉత్సాహం
మిర్యాలగూడ పట్టణంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు భాస్కర్‌రావుకు స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. 300 కళాకారులు కోలాట ప్రదర్శన, డప్పుల దరువులతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజీవ్‌చౌక్‌కు చేరుకోగానే పట్టణంలోని సిక్కులు భాస్కర్‌రావుకు వీరతిలకం దిద్ది కరవాలాన్ని బహూకరించారు.

11 కిలోమీటర్లు సాగిన ర్యాలీ
మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా 10 వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి కుక్కడం గ్రామం నుంచి మిర్యాలగూడ పట్టణం వరకు సుమారు 11 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో అద్దంకి రహదారి పూర్తిగా గులాబీ మయమైంది. దారి పొడవునా స్థాని కులు, మహిళలు భాస్కర్ రావుపై పూలవర్షం కురిపిం చారు. ఈ ర్యాలీ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, టీఆర్‌ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, మోసీన్‌అలీ, ధనావత్ బాలాజీనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూంపాష, ఎంపీపీలు కూరాకుల మంగమ్మ, నామిరెడ్డి రవీణకరుణాకర్‌రెడ్డి, నూకల సరళ హనుమంతరెడ్డి, జడ్పీటీసీలు మట్టపల్లి నాగలక్ష్మిసైదులుయాదవ్, ఇరుగుదిండ్ల పద్మ, పట్టణ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...