సఫాయి కర్మచారీలకు కేంద్ర పథకాలు వర్తింపజేయాలి


Wed,September 12, 2018 01:15 AM

-జాతీయకమిషన్ సభ్యుడు జగదీశ్ హిర్మాణీ
నీలగిరి : సఫాయి కర్మచారీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో వారికి లబ్ధి చేకూరేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలని సఫాయి కర్మచారీల జాతీయ కమిషన్ సభ్యుడు జగదీశ్ హిర్మాణీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా ఎస్సీ రంగనాథ్‌తో కలిసి కర్మచారీలకు కనీస వేతనాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారిలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి మూడు నెలలకోసారి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని ఆదేశించారు. వారి పిల్లలకు రెసిడెన్సియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ సఫాయి కర్మచారీ సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆయా శాఖల ద్వారా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ రంగానాథ్, డీఆర్‌ఓ ఖీమ్యానాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎస్పీ రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ కోటేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరిటెండెంట్ డా.టి. నర్సింగరావు, ఎస్సీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ జినుకల శ్యాంసుందర్, పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో పర్యటన
సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు జగదీశ్ హిరేమణి మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వాల్మికి నగర్‌కు వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడారు. బొట్టుగూడలోని సఫాయి కార్మకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాలనీలో రోడ్డుకు అడ్డంగా కట్టిన కట్టడాలను, మరుగుదొడ్లను దగ్గరుండి తొలగింపజేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నటరాజ్ థియేటర్ సమీపంలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లి మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆకాశ్ అనే బాల కార్మకుడిని గుర్తించారు. బాలకార్మికుడిని విధుల్లో ఉంచుకునేందుకు ఆర్టీసీ అధికారులకు ఎందుకు అనుమతించారో వివరాలు పంపించాలని ఆదేశించారు. బస్టాండ్‌లో పనిచేస్తున్న స్వీపర్లతో మాట్లాడి వారి వేతనాలపై ఆరాతీశారు. జిల్లా కేంద్ర దవాఖానకు వెళ్లి పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎస్పీ రాజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, రెవెన్యూ అధికారులు సంపత్, హమీద్, జినుకల శ్యాంసుందర్, స్థానిక కౌన్సిలర్ మహ్మద్ కలీం, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ డా.టి. నర్సింగరావు తదితరలు పాల్గొన్నారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...