పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలి: కలెక్టర్


Wed,September 12, 2018 01:14 AM

నీలగిరి: ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్‌లో కనీస వసతులు, తప్పులు లేని ఓటర్ల జాబితా కీలమని కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మం డలాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో ఒక బృందం కనీస వసతులు పరిశీలించి రిపేర్లు అవసరం ఉం టే రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. వాటిలో మరమత్తులను 5 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ల్యాండ్ లైన్‌ఫోన్, ప్యాక్స్, నెట్ కనెక్షన్ ఇతర సౌకర్యాలతో సిద్ధ్దంగా ఉండాలన్నారు. జిల్లాలో జాతీయ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2019 కార్యక్రమం ద్వారా జనవరి 01, 2018, అర్హత తేదీగా పరి గణిస్తూ సవరణ కార్యక్రమం షెడ్యూల్ చేసినట్లు కలెక్టర్ వివరించారు. సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తులు, అభ్యంతరలు స్వీకరించి వాటిని పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన జిల్లాగా ప్రకటించుటకు ప్రతి గ్రామం వ్యక్తి గత మరుగుదొడ్లు పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో పనితీరు సక్రమంగా లేని ఏపీఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ నారాయణరెడ్డి మాట్లా డుతూ ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించి మార్పులు చేర్పులు చేయాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ఈఆర్‌ఓ నెట్‌లో అప్‌లోడ్ చేసి బూత్ లెవల్ అధికారులు విచారణ చేయాలన్నారు. సెప్టెంబర్ 15,16 తేదీల్లో పోలింగ్ స్టేషన్‌లో ప్రత్యేకక్యాంపలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌స్టేషన్‌లో అన్ని సౌకర్యాలపై 21 కాలం ప్రోఫార్మాలో రిపోర్టు చేయాలని దానిఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్వో ఖీమ్యానాయక్, జడ్పీ సీఈఓ కోటేశ్వర్‌రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ తదితరలు ఉన్నారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...