ధీర వనిత చాకలి ఐలమ్మ


Tue,September 11, 2018 01:05 AM

నల్లగొండ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీరవనిత చాకలి ఐలమ్మ అని టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ 33 వర్ధంతిని పురస్కరించుకొని రజక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సాగర్ రోడ్డులోని రజకభవన్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి వారు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలమ్మ ఉద్యమస్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాలకుర్తి మార్కెట్‌కు ఐలమ్మ పేరును పెట్టారన్నారు. 5వతరగతి పాఠ్యంశాల్లో ఐలమ్మ జీవిత చరిత్ర చేర్చమన్నారు. అదేవిధంగా ఐలమ్మ జీవిత విశేషాలపై డాక్యుమెంటరీ త్వరలో పూర్తి కావోస్తుందన్నారు. ట్యాంకు బండుపై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైతంగా పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో దావణంల పెల్లుబిక్కిన ఐలమ్మ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిందన్నారు. రజకుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే 18 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించిదన్నారు. వీటీలో రూ.67 కోట్లు రుణాల కోసం నిధులు విడుదల చేసిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆలేరులో రూ. 37,50,800 చొప్పున యూనిట్ కాస్ట్‌తో మోడ్రన్ దోభీ ఘూట్స్ మంజూరైనట్లు తెలిపారు. అంతకుముందు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలె శరణ్యారెడ్డి, తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు, చిలుక రాజు చెన్నయ్య, సట్టు నాగయ్య యాదమ్మ, లకడపురం వెంకన్న, బుచ్చి రాములు, పుల్ల య్య, శ్రీను, శంకర్, తెలంగాణ జాగృతి జిల్లా కోఆర్డినేటర్ భోనగిరి దేవేందర్, పిల్లిరామరాజు, పల్లపు భిక్షపతిరావు, పెద్దులు, కోనేటి నరసింహ, కృష, లక్షణ్ తదితరులు పాల్గొన్నారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...