పీడీఎస్ బియ్యం పట్టివేత


Mon,September 10, 2018 02:41 AM

తుంగతుర్తి/చివ్వెంల: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మోదిన్‌పురం శివారులో గ్రామానికి చెంది న కొక్కిరేణి సుధాకర్ వివిధ గ్రా మాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి అదే గ్రామ శివారులోని తన వ్యవసాయబావి వద్ద గదిలో నిల్వ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 330 బస్తాల్లోని సుమారు 150 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నాగేశ్వర్‌రావు బియ్యాన్ని పరిశీలించారు. నిందితుడు సుధాకర్ పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకోవాలని ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. అదేవిధంగా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి శివారులోని సింగారంతండాలో లారీలో తరలించేం దుకు సిద్ధంగా ఉంచిన 550 బస్తాలు (27.5టన్నుల) పీడీఎస్ బియ్యా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల శేఖర్ రేషాన్ బియ్యాన్ని లారీలో లోడ్ చేసి తూము రమేష్ తోటలో ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. సిబ్బంది దాడి చేసి లారీని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ అంతిరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

178
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...