నేడు కాళోజీ జయంతి


Sun,September 9, 2018 02:14 AM

-తెలంగాణ భాషాదినోత్సవం
-జిల్లా కవులతో కాళోజీకి అనుబంధం
-నివాళులర్పించనున్న అధికారులు, ప్రముఖులు
నల్లగొండకల్చరల్ : కాళోజీ అంటే హేతుబద్ధ్దమైన జీవితం.. విశృంఖలత్వానికి విరుగుడు. పోరాట యోధుడిగా.. సాహిత్య శీలిగా ఆదర్శ వాదిగా భవిష్యత్ తరాలకు ఆయన అనుసరణీయం. 9సెప్టెంబర్ 1914లో కాళోజీ జన్మించారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది. జిల్లాలోని పలువురు కవులతో కాళోజీకి ప్రత్యేక అనుబంధం ఉంది.
తెలంగాణ భాష పరిరక్షణకు విశేష కృషి..
తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు కాళోజీ చేసిన పోరాటం చిరస్మరణీయం. ఆంధ్ర కవి జంద్యాల పాపయ్యశాస్త్రీ తెలంగాణ యాసను తప్పుబడితే ప్రొఫెసర్ జయశంకర్‌ను తీసుకుని గుంటూరు వెళ్లి తెలంగాణ భాష విశిష్టతను వివరించి పాపయ్యశాస్త్రీతో తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పించాడు కాళోజీ. ఆంధ్ర భాష కంటే స్వచ్ఛమైన యాస తెలంగాణదని నిరూపించారు. తెలంగాణ భాషా సౌందర్యంపై అనేక ప్రసంగాలు ఇచ్చి భాషా పరిరక్షణకు పాటుపడ్డారు ప్రజాకవి కాళోజీ.

జిల్లాతో అన్యోన్య అనుబంధం..
కాళోజీకి నల్లగొండ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. జిల్లాలోని ప్రముఖకవి, రచయిత వేణుసంకోజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయమిత్ర సాహిత్య సాంసృ్కతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు కాళోజీ హాజరయ్యారు. కాలేజీ పేరుతో అనేక సభలు సైతం జరిగాయి. అదే విధంగా సాహితీ మేఖల నల్లగొండ ఆధ్వర్యంలో 1997 ఫిబ్రవరి 20న నల్లగొండ జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సాహితీ మేఖల వజ్రోత్సవాలకు ప్రజా కవి కాళోజీ హాజరయ్యారు. ఈ సందర్భంలో అప్పటి ఎంపీ డాక్టర్.బీఎన్‌రెడ్డి కాళోజీని సాహితీరత్న బిరుదుతో సత్కరించి సన్మించారు. ఈ సభలో తెలుగు విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ నాయిని కృష్ణకుమారి, సాహితి మేఖల ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, గజవెల్లి సోదరులు నర్సయ్య, సత్యం తదితరులు కాళోజీతో వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా వేణుసంకోజు ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. వేణుసంకోజుతోపాటు కాళోజీతో జిల్లాలోని అనేక మంది కవులు, రచయితలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. జిల్లాలో కేంద్రంలో కాళోజీకి నివాళుల ర్పించేందుకు ప్రముఖులు, అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

344
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...