విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజ


Sun,September 9, 2018 02:14 AM

చింతలపాలెం : తె లంగాణ ప్రభుత్వం రా ష్ట్ర ప్రజల జీవితాలల్లో నాణ్యమైన విద్యుత్ వెలుగులు నింపేందుకు అహర్నిషలు శ్రమించి మిగులు విద్యుత్ రా ష్ట్రంగా ముందంజలో ఉందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని వజినేపల్లి గ్రామం వద్ద పులిచింతల ప్రాజెక్టు అంతర్భాగంలో నిర్మించిన టీఎస్‌జెన్‌కోలో నాల్గొ విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను సీఓడీ చేసిన అనంతరం పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వాణిజ్య విద్యుత్ ఉత్పత్తితో రైతులకు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపారాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. పులిచింతల జెన్‌కో లోని 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.560 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ. 496 కోట్లు ఖర్చు చేసి 4యూనిట్లను విద్యుత్ ఉత్పత్తిలోకి తీసుకోచ్చామన్నారు. ఈ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసినట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని బట్టి ఈ వి ద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 220మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ విద్యుత్ కేంద్రం 220 మిలియన్ల యూనిట్ల డిజైన్ చేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 23 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న గొప్ప రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన రోజుల్లో ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ 1 యూనిట్‌ను రూ. 5 వెచ్చించి కొనుగోలు చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి కావడంతో 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 4ఖర్చు వస్తుందన్నారు. తద్వారా రాష్ర్టానికి ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా రూ. 22 కోట్ల ఆదా అవుతుందన్నారు. అదే విధంగా పులిచింతల ప్రాజెక్టు వద్ద 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పూర్తి అయ్యాయని, సాధ్యమైనంత త్వరగా అట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి రూ. 28 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌పిడీసిఎల్ సీఎండి రఘుమారెడ్డి, ఎన్‌పిడీసిఎల్ సీఎండి గోపాలరావు, జేఎండీ శ్రీనివాసరావు, (హైడెల్) టీఎస్‌జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజన్, డైరెక్టర్ హెచ్‌ఆర్ అశోక్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ జగత్‌రెడ్డి, డైరెక్టర్ గ్రిడ్ ఆపరేటర్ నవసింగ్‌రావు, డైరెక్టర్ ఆఫ్ ఐపీసీ, ఆర్‌ఏసీ ఎన్‌పీడీసీఎల్ గణపతి, ఎస్‌ఈ సద్గున్ కుమార్, ఎస్‌ఈ సివిల్ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఈ రమేష్‌బాబు పాల్గొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...