బీట్ పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలి


Sun,September 9, 2018 02:13 AM

నల్లగొండ క్రైం : జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బీట్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన బీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీట్ పోలీసులు విధులు సక్రమంగా నిర్వహిస్తే నేరాలను అరికట్టవచ్చన్నారు. పోలీసులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను నిర్వహిస్తూ బీట్ల వారీగా సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని సూచించారు. డీజీపీ ప్రవేశ పెట్టిన నూతన టెక్నాలజీని వినియోగిస్తూ కేసులను అరికట్టడం, నేర పరిశోధనలో టెక్నాలజీ వినియోగం యొక్క ప్రాముఖ్యతల గురించి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిని బట్టి ఇప్పటికే 2నుంచి 5ట్యాబులను ఇవ్వడం జరిగిందన్నారు. వాటి ఆదారంగా ఈ పిట్టి కేసులను నమోదు చేయడం డయల్ 100కాల్స్‌కు వెంటనే స్పందించి బాధితుల వద్దకు చేరుకోవాలన్నారు. ప్రతినెలా బీట్ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును విశ్లేషిస్తూ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించడంతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ట్యాబులను వినియోగించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్వరలోనే ప్రతీ పోలీస్ స్టేషన్‌కు వాహనాలు
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు మరిం త సమర్ధవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఎన్నో రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తుందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అందులో భాగంగా ఈనెలాఖరు వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బీట్ పోలీసులకు వాహనాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరాయని త్వరలోనే వాటిని స్టేషన్ల వారీగా అందించనున్నట్లు తెలిపారు.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...