దళితుల ఆత్మగౌరవాన్ని పెంచింది


Thu,September 6, 2018 12:04 AM

-టీఆర్‌ఎస్ ప్రభుత్వమే
-దళితుల డెయిరీఫామ్‌లకు రూ.37కోట్లు మంజూరు
-ఇంటికి 4బర్రెల చొప్పున 1570కుటుంబాల ఎంపిక
-విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జగదీష్‌రెడ్డి
-జిల్లాకేంద్రంలో అంబేద్కర్ వికాసభవన్‌కు శంకుస్థాపన
కుడకుడరోడ్డు : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్నిరంగాలతోపాటు దళితుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో సుమా రు రూ.4కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో అంబేద్కర్ వికాస భవన నిర్మాణానికి బుధవారంశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ రైతు సమన్వ సమితి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ దళిత నాయకుడు మొండికత్తి వెంకటేశ్వర్లు(ఎంవీఎల్) అధ్యక్షతన జరిగిన భారీ సభలో మంత్రి మాట్లాడారు. దళితుల అభివృద్ధికి నాలుగేండ్లుగా ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టామని, ఇప్పుడు రూ.37కోట్లతో దళితులకు డెయిరీఫామ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ 4 బర్రెల చొప్పున 1570 కుటుంబాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. యావత్ దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ అభివృద్ధి చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం అమల్లోకి వచ్చిన మొదటిసారే సూర్యాపేటకు రూ.10కోట్లు మంజూరు చేయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా సంచలనాత్మకంగా రూ.20కోట్లతో 69ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తిచేసిన ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ.5లక్షల సబ్సిడీతో దళితులకిచ్చే రుణాలను రూ.12లక్షలకు పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అన్నారు. 50యూనిట్ల ఉచిత విద్యుత్ వాడకాన్ని 101 యూనిట్లకు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్న ఘనత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, కలెక్టర్ సురేంద్రమోహన్, ఆర్డీఓ మోహన్‌రావు, చైర్‌పర్సన్ ప్రవళికాప్రకాష్, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్లు, భిక్షం, చినశ్రీరాములు, ఎల్లయ్య, భాస్కర్, శ్రీరాములు, దశరథ, జీడి భిక్షం, జయశంకర్, వెంకన్న, వంశీ, ప్రకాష్, సైదులు తదితరులు ఉన్నారు.

60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
పెద్దఅడిశర్లపల్లి : అక్రమంగా లారీలో తరలించేందుకు యత్నిస్తున్న 60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతోపాటు వాహనాలను గుడిపల్లి పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వివిధగ్రామాల్లో రేషన్‌షాపుల నుంచి కొనుగొలు చేసి గుట్టుచప్పుడు కాకుండా రెండు బొలెరోలోఏకేబీఆర్ సమీపంలో తరలించి లారీలోకి లోడు చేస్తుండగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సిబ్బంది దాడి చేసి వాహనాలతోపాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...