సీఎం కేసీఆర్‌తోనే రజకుల అభివృద్ధి : కొండూరు


Thu,September 6, 2018 12:04 AM

పానగల్: సీఎం కేసీఆర్‌తోనే రజకుల అభివృద్ధి సాధ్యమవుతుంద ని తెలంగాణ రజకసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రాపాలకులు రజకుల సంక్షేమాన్ని విస్మరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే సీఎం కేసీఆర్ రజకుల అభివృద్ధ్ది కోసం రజక సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో రజక భవన నిర్మాణానికి రూ.5 కోట్లు, నల్లగొండ జిల్లా రజక భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర రాజధానిలో రజక భవనానికి రూ.5కోట్లు, జిల్లా భవనానికి రూ.50 లక్షల నిధులు మం జూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా భవనానికి రూ.50 లక్షల మంజూరు చేయడంపై స్వీట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో రజక సంఘాల జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదు లు, భవన కన్వీనర్ చిలుకరాజు చెన్న య్య, నాయకులు లకడాపురం వెంకన్న, దొనకొండ రవి, పగిళ్ల కృష్ణ, కొండూరు వెంకటయ్య, గడ్డం కృష్ణ,పగిళ్ల వెంకన్న, ఎలిజాల శంకర్, సిరికొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...