రాజీ మార్గమే.. రాజమార్గం


Sun,December 15, 2019 04:04 AM

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : కేసుల రాజీకి లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని, సుదీర్ఘంగా ఉన్న కేసులను రాజీ కుదుర్చుకోవడమే రాజమార్గమని జిల్లా అదనపు జడ్జి రవికుమార్‌ సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక కోర్టు సముదాయంలో శనివారం జాతీయలోక్‌ అదాలత్‌ నిర్వహించారు. అదనపు జడ్జి రవికుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శీతల్‌, మొబైల్‌కోర్టు జడ్జి మురళీమోహన్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు బాబుపీయర్స్‌, సత్యనారాయణరావు, భవానిబాయి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు కిమినల్‌, సివిల్‌, బ్యాంకు కేసులు, మెయింటనెన్స్‌ కేసులు దా దాపు 108 కేసులను రాజీ కుదిర్చారు. దాదాపు నాలుగు రోజులపాటు రేవల్లి మండలం శాయిన్‌పల్లి, రేవల్లి, నాగాపూర్‌, గౌరిదేవిపల్లి వివిధ గ్రామాల్లో చట్టాలపైన అవగాహన సదస్సులు లనిర్వహించారు. కార్యక్రమంలో బ్యా ంకు మేనేజర్లు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.
లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
అచ్చంపేట రూరల్‌ : చిన్న చిన్న కేసులలో చిక్కుకుని పోలీస్‌ స్టేషన్‌, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సివిల్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి (జడ్జి) భవాని కోరారు. పట్టణంలోని కోర్టు వద్ద ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ఆయా మండలాల పరిధిలో 60 కేసులకు రాజీ కుదిర్చారు. 19 కేసులకు నేరం అంగీకరించగా మరో 2 సివిల్‌ కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంగాపురం రంగయ్య పౌండేషన్‌ ఆధ్వర్యంలో కక్షిదారులకు భోజనవసతి కల్పించారు. కా ర్యక్రమంలో న్యాయవాదులు రాజేందర్‌, వెంకట్‌శెట్టి, శ్రీధర్‌రావు, మస్తాన్‌, వెంకటేశ్వర్‌రావు, కృష్ణ, కౌసర్‌, సుధాకర్‌, చంద్రారెడ్డి, మల్లేశ్‌, సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలతో ముందుకుసాగాలి
విద్యార్థినులు లక్ష్యంతో చదవాలని సివిల్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి భవానీ సూచించారు. రక్షిత మహిళా సొసైటీ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతం లోకి అడుగిడుతున్న సందర్భంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన అంబలి కేంద్రం, చలివేంద్రం, మొక్కల పెంపకం తదితర సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. అత్యవసర సమయాల్లో 100నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు జయమ్మ, జ్యోతి, మాధవి, రేఖలు పాల్గొన్నారు.
కోర్టుల చుట్టూ తిరుగొద్దు..
కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : చిన్నచిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని కల్వకుర్తి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి మారం అర్పితారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కల్వకుర్తి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆవరణలో మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ మాట్లాడుతూ మంచి మనస్సుతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.కల్వకుర్తి ము న్సిఫ్‌ కోర్టు పరిధిలో లీగల్‌, సివిల్‌ కేసులకు సంబంధించి 124 కేసులను రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా కక్షిదారులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో పీపీతో పాటు సీనియర్‌ న్యాయవాదులు లక్ష్మణశర్మ, లక్ష్మీనారాయణ,సీ కృష్ణయ్య,వెంకట్మ్రణ, రాంగోపాల్‌, నియోజకవర్గంలోని పోలీస్‌ , బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...