సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Sat,December 14, 2019 12:16 AM

-పెండ్లిలకు అండగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌
-మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన జైపాల్‌యాదవ్‌
కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్‌ మండల కేంద్రంలోని ఏంబీఏ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మండలంలో 43 మందికి మంజూరైన కల్యాణలక్ష్మీ చెక్కులను జెడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డ పెండ్లి అంటే అప్పుల కోసం తొక్కని గడప అంటూ ఉండేది కాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. మండలంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు స్థలాన్ని గుర్తించి భవనాల నిర్మాణాలను చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సర్పంచులు లక్ష్మీనర్సింహరెడ్డి, కృష్ణయ్యయాదవ్‌, భారతమ్మ, యాదయ్య, సుగుణ, శంకర్‌, ఎంపీటీసీలు గోపాల్‌, ఉమావతి, రాములుగౌడ్‌, ఉప సర్పంచులు రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, వినోద్‌, ఎల్లాగౌడ్‌, నరేశ్‌, ఎంపీడీవో అనురాధ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ జోగు వీరయ్య, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జహంగీర్‌అలీ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గుప్తా, నాయకులు మోత్యానాయక్‌, లాయక్‌అలీ, గంప శ్రీను, బుగ్గయ్యగౌడ్‌, నర్సింహాగౌడ్‌, చంద్రమోళి, సాయిలు, విఠలయ్య, శంకర్‌నాయక్‌, బాలకృష్ణ, మహేశ్‌ హెచ్‌ఆర్‌, రాజేందర్‌యాదవ్‌, జంగయ్య, రమేశ్‌, లింగం, కృష్ణయ్య, లక్ష్మణ్‌నాయక్‌, లబ్ధిదారులు ,తదితరులు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...