నల్లమలలో హెలిక్యాప్టర్‌ చక్కర్లు


Fri,December 13, 2019 12:53 AM

-ఆందోళన చెందుతున్న స్థానికులు
-గత నెలలోనూ ఇదే సీన్‌
-‘యురేనియం’ అంశంపై భయపడుతున్న ఆదివాసీ గిరిజనులు
నల్లమలలో హెలీక్యాప్టర్‌ చక్కర్లు
అమ్రాబాద్‌ రూరల్‌: నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం హెలీక్యాప్టర్‌ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలోని వటువర్లపల్లి, సార్లసల్లి, కుడిచింతబైలు గ్రామాల మీదుగా హెలీక్యాప్టర్‌ చక్కర్లు కొడుతున్న విషయాన్ని స్థానికులు సెల్‌ఫోన్‌లో క్లిక్‌మనిపించారు. హెలీక్యాప్టర్‌ తిరగడంతో స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యురేనియం నిక్షేపాలు వెలికితీస్తున్నారనే ఉదంతులు, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతులు ఇచ్చిందని సర్వే కోసం అటానమిక్‌ జనరల్‌ ఎనర్జీకి చెందిన కేంద్ర అధికారులు పర్యటనలు చేస్తారని వార్తలు రావడంతో స్థానిక ప్రజలు ముక్త కంఠంగా వ్యతిరేకించారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లమలలో యురేనియం వెలికితీసే ప్రసక్తే లేదని స్వయంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌చేత తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నెల రోజుల క్రితం, మళ్లీ నేడు నల్లమల ప్రాంతంలో హెలీక్యాప్టర్‌ చక్కర్లు కొడుతుండటంతో నల్లమల ప్రజలు చర్చించుకుంటున్నారు.


78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...