యోగా, ధ్యానంతోనే ప్రశాంతమైన జీవితం


Fri,December 13, 2019 12:50 AM

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్‌: యోగా, ధ్యానంతోనే ప్రశాంతమైన జీవితం లభిస్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలోని ధ్యాన ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్‌ ఏడవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ధ్యాన మందిరంలో కొంత సమయం ధ్యానం చేసిన అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాలను అలవర్చుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బ్రహ్మర్షి పితా మహా పత్రిజీ, ఎంపీపీ శాంతాలోక్యానాయక్‌, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, సర్పంచ్‌ జితేందర్‌రెడ్డి, పదర రాంబాబునాయక్‌, మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...